Axis Bank Profit: లాభాల బాటలో యాక్సిస్ బ్యాంకు.. మూడవ త్రైమాసికంలో మూడు రేట్లు పెరిగిన ఆదాయం
Axis Bank Profit: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ నికర లాభం మూడు రెట్లు..
Axis Bank Profit: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ.3,614 కోట్లకు చేరుకుంది. క్రెడిట్‌లో బలమైన వృద్ధి, ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కారణంగా బ్యాంక్ లాభాలు పెరిగాయి. యాక్సిస్ బ్యాంక్ సోమవారం స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.1,117 కోట్లుగా ఉంది. మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 21,101 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.18,355 కోట్లుగా ఉంది.
త్రైమాసికంలో రిటైల్ రుణాలలో బ్యాంక్ ఏడాది ప్రాతిపదికన 18 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నివేదికలు వెల్లడయ్యాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రుణాలలో 20 శాతం మరియు కార్పొరేట్ రుణాలలో 13 శాతం వృద్ధి ఉంది. అలాగే మొండి బకాయిలపై యాక్సిస్ బ్యాంక్ కేటాయింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.790 కోట్లకు చేరుకోగా, గత త్రైమాసికంలో రూ.927 కోట్లుగా ఉంది.
బ్యాంక్ ఎన్‌పిఎలో మెరుగుదల
త్రైమాసికంలో బ్యాంక్ నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) 3.17 శాతానికి మెరుగుపడ్డాయి, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 3.44 శాతంగా ఉన్నాయి. అయితే ఈ కాలంలో నికర ఎన్‌పీఏలు 0.74 శాతం నుంచి 0.91 శాతానికి పెరిగాయి. ఇక డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 18.8 శాతం పెరిగి రూ. 6536.55 కోట్లకు చేరుకుందని ఐసిఐసిఐ బ్యాంక్ శనివారం తెలిపింది. ఈ కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9,912 కోట్ల నుంచి 23 శాతం పెరిగి రూ.12,236 కోట్లకు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను బ్యాంక్ వెల్లడించింది.
అదే సమయంలో, డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 77 శాతం పెరిగి రూ.266 కోట్లకు చేరుకుందని యెస్ బ్యాంక్ శనివారం తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.151 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు నష్టాలను చవిచూస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్రైమాసికంలో బ్యాంక్ కేటాయింపులు ఏడాది ప్రాతిపదికన 82.1 శాతం క్షీణించి రూ.375 కోట్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో ఇది రూ.2,089 కోట్లుగా ఉంది.
ఇవి కూడా చదవండి: