AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు తనిఖీ చేయవలసిన టాప్ 5 విషయాలు

Second Hand Car: పాత కారు కొనే ముందు దానిని మంచి మెకానిక్ ద్వారా తనిఖీ చేయించడం లేదా కంపెనీ అధీకృత సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లడం చాలా ముఖ్యం. మీరు ఈ పని చేస్తే, ఆ కారులో మీరు అర్ధం చేసుకోలేని ఏదైనా..

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు తనిఖీ చేయవలసిన టాప్ 5 విషయాలు
Subhash Goud
|

Updated on: Aug 05, 2025 | 10:28 AM

Share

Second Hand Car: కుటుంబ అవసరాల కోసం లేదా సెలవుల్లో టూర్లు ప్లాన్‌ చేయడానికి సొంత కారు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి కల. సొంత కారు ఉన్నాలన్న కలను నెరవేర్చుకునేందుకు చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనుగోలు చేస్తుంటారు. కొత్త కారు కొనే స్థితిలో లేనివారు సెకండ్స్‌కు వెళ్తుంటారు. అయితే సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటున్నట్లయితే ముందు ఈ విషయాలను గుర్తించుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు టెక్‌ నిపుణులు.

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. కాస్త అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి సమస్యలు లేని మంచి సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Auto News: రూ.8 లక్షల్లోపే 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌తో SUV.. 800 కి.మీ రేంజ్‌.. బెస్ట్‌ ఫీచర్స్‌!

ఇవి కూడా చదవండి

ముందుగా మీ బడ్జెట్‌ సెట్‌ చేసుకోండి:

సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ముందు, మొదట చేసేపని మీ బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం. మీ బడ్జెట్‌ దాటి వెళితే ఆర్థిక భారం పెరుగుతుంది. సరైన అవగాహన లేకుండా కొంటే దాదాపు కొత్త కారు ధర అవుతుంది. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అమ్మే వివిధ ప్లాట్‌ఫామ్‌లలో అదే కారు ధరను చెక్‌ చేయండి. మీ బడ్జెట్‌ను బట్టి ఒక ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకోండి.

టెస్ట్ డ్రైవ్ చేయండి:

మీరు కొనాలనుకుంటున్న పాత కారును ఎంచుకున్న తర్వాత ఆ వాహనాన్ని టెస్ట్ డ్రైవ్ చేయండి. ఏదో కాస్త దూరం అలా వెళ్లి ఇలా వస్తే ఆ కారులో లోపాలు కనిపించవు. అవసరం అనుకుంటే మంచి మెకానిక్‌ను తీసుకెళ్లి చూపించండి. వీలైనంత లాంగ్‌ డ్రైవ్‌ చేయండి. తద్వారా ఆ కారు బాగా నడుస్తుందో లేదో మీకు తెలుస్తుంది. ఏదైనా సమస్య ఉంటే మీరు ముందుగానే అర్థం చేసుకుంటారు. అనుభవజ్ఞుడితో కారు నడిపిస్తే మరి మంచిది. లోపాలు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. అతని సూచనల ప్రకారం కారు కొనండి.

ఖర్చు అంచనా కూడా అవసరం:

మరో అతి ముఖ్యమైన విషయం ‘అంచనా’. టెస్ట్ డ్రైవ్ సమయంలో మీరు గమనించిన విషయాలు, లోపాలు, ఆ బండి మార్కెట్ ధర, అడిగే ధర అన్నింటినీ అంచనా వేయండి. కారులో ఏవైనా లోపాలు ఉంటే వాటిని మరమ్మతు చేయడానికి అయ్యే ఖర్చును ఖచ్చితంగా అంచనా వేసి, కార్‌ అమ్మే ధర నుంచి ఆ ఖర్చులను తగ్గించి అడగండి. లేదా, మరమ్మతులన్నీ చేయించిన తర్వాత తీసుకుంటానని చెప్పండి. మీ డబ్బుకు సరైన విలువ ఇచ్చే కారును మాత్రమే ఎంచుకోండి.

మెకానిక్ చేత చెక్ చేయించండి:

పాత కారు కొనే ముందు దానిని మంచి మెకానిక్ ద్వారా తనిఖీ చేయించడం లేదా కంపెనీ అధీకృత సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లడం చాలా ముఖ్యం. మీరు ఈ పని చేస్తే, ఆ కారులో మీరు అర్ధం చేసుకోలేని ఏదైనా సమస్య ఉంటే మీకు తెలుస్తుంది. కాబట్టి, సెకండ్‌ హ్యాండ్‌ కార్‌ కొనేప్పుడు ఈ విషయాన్ని విస్మరించొద్దు.

సర్వీస్ రికార్డును చెక్‌ చేయండి:

టెస్ట్‌ డ్రైవ్‌ తర్వాత ఆ కారు సర్వీస్ రికార్డును కూడా తనిఖీ చేయాలి. దీనివల్ల ఆ వాహనానికి ఎన్ని సర్వీస్‌లు చేయించారు? ఏయే విడిభాగాలు మార్చారు అనే విషయం మీకు తెలుస్తుంది.

పేపర్లను చెక్‌ చేయండి:

సెకండ్‌ హ్యాండ్‌ కారును కొనే ముందు ఆ కారుకు సంబంధించిన అన్ని పేపర్లను క్షుణ్ణంగా చూడండి. కారు ఛాసిస్ నంబర్ అండ్‌ ఇంజిన్ నంబర్‌ను రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పోల్చి చూడండి. అది సరిపోలకపోతే ఆ కారులో ఏదో తిరకాసు ఉందని అర్ధం. దాని జోలికి వెళ్లకండి.

ఇది కూడా చదవండి: AP School Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలలకు భారీగా సెలవులు.. విద్యార్థులకు పండగే..!

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి