AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: వామ్మో.. ఇక ఏం కొంటాం.. అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..

బంగారం ధర తాజాగా.. లక్ష రెండు వేలు దాటింది. అయితే లక్ష దాటి చాలా రోజులైనా.. దాని రేటు అక్కడక్కడే తిరుగుతోంది. ఇప్పుడు పండగ సీజన్‌ వచ్చేసింది. వ్రతాలు, నోములు చాలా ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజీల కాలం కావడంతో.. బంగారానికి డిమాండ్‌ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది

Gold Rates: వామ్మో.. ఇక ఏం కొంటాం.. అందనంత ఎత్తుకు బంగారం ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..
Gold Rates
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2025 | 10:59 AM

Share

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవలే బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుని పరుగులు పెడుతున్నాయి.. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో రేట్లు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా మంగళవారం (ఆగస్టు 5) బంగారం ధర.. లక్షా రెండు వేలు దాటింది. అయితే లక్ష దాటి చాలా రోజులైనా.. దాని రేటు అక్కడక్కడే తిరుగుతోంది. ఇప్పుడు పండగ సీజన్‌ వచ్చేసింది. వ్రతాలు, నోములు చాలా ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజీల కాలం కావడంతో.. బంగారానికి డిమాండ్‌ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. దీంతో గోల్డ్‌ రేట్‌ మరింత ప్రియమవుతుందనే టాక్‌ నడుస్తోంది. ఇప్పుడే త్వరపడండి.. లేకుంటే రేటు పోటు తప్పదంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌..

దేశియంగా మంగళవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి..

  • 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 820 పెరిగి.. రూ.1,02,220కి చేరుకుంది.
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.93,700 లకి చేరుకుంది..
  • ఇక వెండి కిలో ధర రూ.2000 లు పెరిగి రూ.1,15000 చేరుకుంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,02,220 ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,700 ఉంది. కిలో వెండి ధర రూ.1,25,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,02,220, 22 క్యారెట్ల ధర రూ.93,700 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,25,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,370, 22 క్యారెట్ల ధర రూ.93,850 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,15,000 లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,220, 22 క్యారెట్ల ధర రూ.93,700 ఉంది. వెండి ధర కిలో రూ.1,15,000 గా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,220 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,700 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,25,000 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,02,220, 22 క్యారెట్ల ధర రూ.93,700 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,15,000 లుగా ఉంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..