Jeans Pant: జీన్స్ ప్యాంట్‌కు ఈ చిన్న జేబు ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? అసలు కారణం ఇదే!
Jeans Pants: జీన్స్ పాకెట్స్ పై బటన్లు 1829 నుండి ఉన్నాయి. ఆ సమయంలో లెవియస్ స్ట్రాస్ కంపెనీ కొత్తది. ఆ ప్రాంతంలోని మైనర్లు ఫ్యాషన్ జీన్స్ ధరించేవారు . ఆ కాలంలో కార్మికులు చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అలాగే వారిలో చాలామంది తమ ప్యాంటు పాకెట్స్ చిరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. టెల్వ్ జాకబ్ డేవిస్ జేబు వైపు చిన్న మెటల్ బిట్స్
Updated on: Aug 05, 2025 | 7:05 AM

Jeans Pants: ప్రస్తుతం జీన్స్ ప్యాంట్లకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్‌కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గతంలో జీన్స్ ప్యాంట్లు అబ్బాయిలు మాత్రమే ధరించే వారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో పోటీ పడుతూ జీన్స్‌ను ధరిస్తున్నారు. జీన్స్ అంటేనే అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా, వృద్దులు అయినా ఇష్టపడుతుంటారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే వృద్దులు సైతం జీన్స్ ప్యాంట్లను ధరిస్తుంటారు. ఈ జీన్స్ ప్యాంట్లను ఆకర్షించేందుకు మార్కెట్లో రకరకాల జీన్స్ అందుబాటులో ఉన్నాయి. జీన్స్‌కు బటన్స్, ప్యాకెట్లు, ఇలా రకరకాల డిజైన్‌లను ప్యాంటుకు మరింత అందాన్ని తెచ్చి పెడతాయి. జీన్స్‌కు ఒక చిన్నపాటి ప్యాకెట్ కామాన్‌గా ఉంటుంది. మరి ఇది ఎందుకు ఉంటుందోననని మీరెప్పుడైనా గమనించారా? అదే చిన్న జేబులాంటిది.

చిన్న జేబు ఎందుకు ఉంటుంది?: సాధారణంగా ప్రతి జీన్స్ ప్యాంట్‌కు పైనే ఓ చిన్న జేబు ఉంటుంది. అది ఎందుకు ఉంటుందోనని పెద్దగా పట్టించుకోరు. ఈ జేబు ఉండటం వెనుక కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం. జీన్స్ ప్యాంట్‌ను శ్రామిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే రైల్వే ఉద్యోగులు, వడ్రంగి కార్మికులు, మైనింగ్ కార్మికులు. ఆ సమయంలో కార్మికుల సౌకర్యం కోసం మందపాటి వస్త్రం, చిన్న పాకెట్స్ ఉన్న జీన్స్ తయారు చేశారు. దీని వెనుక కారణం ఏంటంటే, 19వ శతాబ్దంలో ఉపయోగించిన గడియారాలకు బెల్టులు లేవు. అంతేకాకుండా వాటి డయల్స్ కూడా చిన్నవిగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వాటిలో జేబులో ఉంచుకుంటే కిందపడి పగిలిపోయే అవకాశం ఉంది. దీంతో వాచ్ సురక్షితంగా ఉండేందుకు ఈ జీన్స్ ప్యాంట్‌కు చిన్నపాటి ప్యాకెట్‌ల ఉండే జేబును తయారు చేశారట.

దీనినిన గతంలో వాచ్ ప్యాకెట్ అని పిలిచేవారు. కానీ కాల మారుతున్నకొద్ది పేర్లను రకరకాలుగా పిలుస్తున్నారు. డబ్బులు లేదా చిన్నపాటి ఏదైనా వస్తువును ఈ ప్యాకెట్లో పెట్టుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ చిన్నపాటి ప్యాకెట్ నేటికీ జీన్స్‌లో ఉంచుతున్నారు. ఆ చిన్న జేబులో రెండు బటన్లు ఉండటం మీరు గమనించే ఉంటాయి. అయితే.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చిన్న జేబులోని రెండు బటన్లు తొలగించారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయుధాలు, బుల్లెట్లను తయారు చేయడానికి లోహాన్ని సేవ్ చేయాల్సి వచ్చింది. కానీ యుద్ధం తర్వాత, వాటిని మళ్ళీ జీన్స్‌పై రివెట్‌లు ఉంచడం ప్రారంభించారు.

జీన్స్ పాకెట్స్ పై బటన్లు 1829 నుండి ఉన్నాయి. ఆ సమయంలో లెవియస్ స్ట్రాస్ కంపెనీ కొత్తది. ఆ ప్రాంతంలోని మైనర్లు ఫ్యాషన్ జీన్స్ ధరించేవారు . ఆ కాలంలో కార్మికులు చాలా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అలాగే వారిలో చాలామంది తమ ప్యాంటు పాకెట్స్ చిరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. టెల్వ్ జాకబ్ డేవిస్ జేబు వైపు చిన్న మెటల్ బిట్స్ ఉంచడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాడు. ఈ బటన్లను రివెట్స్ అని పిలుస్తారు. జేబును బలోపేతం చేయడానికి వాటిని చొప్పించారు. పాకెట్స్ రోజువారీ దుస్తులు చిరిగిపోవడం వల్ల దెబ్బతింటాయి. అందుకే జీన్స్‌ను బలోపేతం చేయడానికి ఈ రివెట్‌లను జోడించారు.

1853 ఏడాదిలో లెవి స్ట్రాస్ అనే వ్యాపారవేత్త లెవి స్ట్రాస్ అండ్ కంపెనీ అనే జీన్స్ కంపెనీని ప్రారంభించాడు. నీలిరంగు జీన్స్‌ను తయారు చేసిన మొదటి కంపెనీ ఇదే. 1873 సంవత్సరంలో కంపెనీ జీన్స్‌కు పేటెంట్‌ను నమోదు చేసినప్పుడు, పాకెట్‌తో పాటు ఒక చిన్న జేబును కూడా పొందుపర్చింది. అప్పటి నుంచి కంపెనీ యొక్క ఈ డిజైన్‌ను అందరూ అనుసరించారు. 1890లో కంపెనీ లాట్ 501 జీన్స్‌తో ఈ డిజైన్‌ను ప్రారంభించింది. ఈ చిన్నపాటి జేబు జీన్స్‌లో కనిపిస్తుంటుంది.

పాశ్చాత్య సమాజంలో ప్యాంటులను చాలా కాలంగా పురుష దుస్తులుగా పరిగణించేవారు. 19వ శతాబ్దపు దుస్తుల సంస్కర్తలు మహిళలకు ప్యాంటును ప్రవేశపెట్టడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ శైలి చాలా రాడికల్‌గా తిరస్కరించారు. 20వ శతాబ్దంలోనే మహిళలు ప్యాంటు ధరించడం సముచితంగా భావించబడింది. మొదట క్రీడలకు, తరువాత సాధారణ దుస్తులకు, చివరకు వ్యాపార, అధికారిక దుస్తులకు మార్చేశారు.




