Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లులు వేధిస్తున్నాయా..? ఆ ఒక్క పనితో మీ సమస్య ఫసక్

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో క్రెడిట్ కార్డులు అనేవి చాలా మందికి తప్పనిసరి అవసరంగా మారాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు క్రెడిట్ కార్డుల వినియోగాన్ని బాగా ఇష్టపడుతున్నారు. మీ వద్ద నగదు లేకపోయినా మీరు క్రెడిట్ కార్డ్‌తో సులభంగా షాపింగ్ చేయవచ్చు. ముఖ్యంగా కొన్ని కంపెనీల క్రెడిట్ కార్డుల చెల్లింపులపై మెరుగైన డిస్కౌంట్‌లను అందిస్తాయి.

Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లులు వేధిస్తున్నాయా..? ఆ ఒక్క పనితో మీ సమస్య ఫసక్
Credit Card
Follow us

|

Updated on: Sep 06, 2024 | 4:30 PM

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో క్రెడిట్ కార్డులు అనేవి చాలా మందికి తప్పనిసరి అవసరంగా మారాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు క్రెడిట్ కార్డుల వినియోగాన్ని బాగా ఇష్టపడుతున్నారు. మీ వద్ద నగదు లేకపోయినా మీరు క్రెడిట్ కార్డ్‌తో సులభంగా షాపింగ్ చేయవచ్చు. ముఖ్యంగా కొన్ని కంపెనీల క్రెడిట్ కార్డుల చెల్లింపులపై మెరుగైన డిస్కౌంట్‌లను అందిస్తాయి. క్రెడిట్ కార్డ్‌పై చేసిన ప్రతి కొనుగోలు తప్పనిసరిగా గ్రేస్ పీరియడ్‌లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ వ్యవధిలోపు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. ఒకవేళ ఆ సమయంలో లోపు బిల్లు చెల్లించకపోతే వడ్డీ బాదుడు షురూ అవుతుంది. ఈ నేపథ్యంలో అనుకోని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా జరిమానాల బాదుడు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు చెప్పే ఆ టిప్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

బ్యాలెన్స్ బదిలీ మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించడానికి బాకీ ఉన్న బ్యాలెన్స్‌ను మరొక క్రెడిట్ కార్డ్‌కి బదిలీ చేయడానికి అనుమతిస్తుంది. అయితే బ్యాలెన్స్ బదిలీ చేయడానికి రెండో కార్డ్ తప్పనిసరిగా తగినంత క్రెడిట్ పరిమితిని కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు అందుబాటులో ఉన్న పరిమితిలో 75 శాతం వరకు మాత్రమే బదిలీ చేయవచ్చు. బ్యాలెన్స్ బదిలీని సులభతరం చేసే బ్యాంక్ సాధారణంగా ఈ సేవ కోసం ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీను వసూలు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు క్రెడిట్ కార్డు బిల్లును తిరిగి చెల్లించడానికి మీకు తాజా గ్రేస్ పీరియడ్‌ను ఇస్తుంది. ఈ కొత్త గ్రేస్ పీరియడ్‌లోపు మొత్తాన్ని చెల్లిస్తే మీకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఇది మీరు డిఫాల్టర్‌గా మారకుండా మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడుతుంది.

బ్యాలెన్స్ బదిలీని ప్రారంభించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. బదిలీని అభ్యర్థించడానికి మీ బ్యాంక్ కస్టమర్ హెల్ప్‌లైన్‌ను కాల్ చేయవచ్చు. బ్యాలెన్స్‌ని మీరే బదిలీ చేసుకోవడానికి మీ బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్‌ని ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఈ సేవలను పొందేందుకు రెండు కార్డుల వివరాలు అవసరం. మీరు బ్యాలెన్స్‌ని ఒకేసారి లేదా ఈఎంఐల ద్వారా తిరిగి చెల్లించవచ్చు. అయితే తరచుగా ఈ పద్ధతిపై ఆధారపడటం మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌ను వాడుకున్న తర్వాత కూడా చెల్లింపులో విఫలమైతే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వడ్డీ కూడా చక్రవడ్డీ ప్రాతిపదికన లెక్కిస్తారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్రెడిట్ కార్డు బిల్లులు వేధిస్తున్నాయా.?ఆ ఒక్క పని చేస్తే చాలంతే
క్రెడిట్ కార్డు బిల్లులు వేధిస్తున్నాయా.?ఆ ఒక్క పని చేస్తే చాలంతే
డెంగ్యూని లైట్ తీసుకోకండి.. మీ ప్రాణాలు తీసేస్తుంది..
డెంగ్యూని లైట్ తీసుకోకండి.. మీ ప్రాణాలు తీసేస్తుంది..
అమ్మాయిలు చిన్నతనంలో రజస్వల ఎందుకు అవుతున్నారు? నిపుణుల సలహా ఏమిట
అమ్మాయిలు చిన్నతనంలో రజస్వల ఎందుకు అవుతున్నారు? నిపుణుల సలహా ఏమిట
అందుబాటులోకి యూపీఐ సర్కిల్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటి? ఎలా యాక్టివేట్
అందుబాటులోకి యూపీఐ సర్కిల్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటి? ఎలా యాక్టివేట్
ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి..
ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని సీక్రెట్స్ చాలా ఉన్నాయి..
క్రేజీ లుక్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న హీరో స్కూటర్..
క్రేజీ లుక్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న హీరో స్కూటర్..
ఆ ఏథర్ స్కూటర్‌లో అదరగొడుతున్న సెఫ్టీ ఫీచర్లు..!
ఆ ఏథర్ స్కూటర్‌లో అదరగొడుతున్న సెఫ్టీ ఫీచర్లు..!
టికెట్ ద‌క్కలేద‌ని గుక్కపట్టి ఏడ్చేసిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో
టికెట్ ద‌క్కలేద‌ని గుక్కపట్టి ఏడ్చేసిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో
భారతదేశంలోని 7 అతిపెద్ద చేపల మార్కెట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
భారతదేశంలోని 7 అతిపెద్ద చేపల మార్కెట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
ఆకర్షిస్తున్న బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్..!
ఆకర్షిస్తున్న బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్..!