Lucid Gravity: మార్కెట్‌లోకి మరో కొత్త ఈవీ కారు… ప్రీమియం లుక్‌తో అధునాతన ఫీచర్లు..

భారతదేశంలో ఈవీ వాహనాల్లో స్కూటర్ల వినియోగం భారీ స్థాయిలో ఉన్నా కార్లు వాడకంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. విస్తృత ఇండియన్‌ మార్కెట్‌ను దృష్టిలో అన్ని కంపెనీలు కొత్త కార్లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెడితే ప్రీమియం కంపెనీలు కొత్తకొత్త ఈవీలను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ లుసిడ్‌ మోటార్స్‌ గ్రావిటీ ఎస్‌యూవీ పేరుతో సరికొత్త ఈవీ కారును లాంచ్‌ చేసింది. ఈ కారులోని ఫీచర్లు ఈవీ ప్రియులను ఆకట్టకుంటున్నాయి. లుసిడ్‌ గ్రావిటీ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Lucid Gravity: మార్కెట్‌లోకి మరో కొత్త ఈవీ కారు… ప్రీమియం లుక్‌తో అధునాతన ఫీచర్లు..
Lucid Gravity Suv
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 19, 2023 | 5:19 PM

ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈవీ వాహనాలు వాడడంతో వీటి వినియోగం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహనా కాలుష్యం నుంచి రక్షణ కోసం ఈవీ వాహనాలపై సబ్సిడీలను వినియోగాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే భారతదేశంలో ఈవీ వాహనాల్లో స్కూటర్ల వినియోగం భారీ స్థాయిలో ఉన్నా కార్లు వాడకంలో మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. విస్తృత ఇండియన్‌ మార్కెట్‌ను దృష్టిలో అన్ని కంపెనీలు కొత్త కార్లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెడితే ప్రీమియం కంపెనీలు కొత్తకొత్త ఈవీలను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ లుసిడ్‌ మోటార్స్‌ గ్రావిటీ ఎస్‌యూవీ పేరుతో సరికొత్త ఈవీ కారును లాంచ్‌ చేసింది. ఈ కారులోని ఫీచర్లు ఈవీ ప్రియులను ఆకట్టకుంటున్నాయి. లుసిడ్‌ గ్రావిటీ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

లుసిడ్‌ గ్రావిటీ ఈవీ ఎస్‌యూవీ ఏడుగురు ప్రయాణించేందుకు వీలుగా రూపొందించారు. ఈ కారు 2.2 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు, 5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, దాదాపు 1.7 మీటర్ల ఎత్తుతో వస్తుంది. రెండు వెనుక సీట్లను మడతపెట్టే అవకాశం ఉండడంతో ఈ కారు లోపల 3200 లీటర్ల సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ కారు దాదాపు 680 కేజీల వేయిట్‌ను మోస్తంది. అలాగే 2700 కిలోల టోయింగ్‌ కెపాసిటీతో వస్తుంది. లూసిడ్‌ గ్రావిటీ ఈవీను ఈవీ2.0గా పేర్కొంటుంది. ముఖ్యంగా ప్రీమియం కస్టమర్లను టార్గెట్‌ చేస్తూ ఈ కారను లాంచ్‌ చేశారు. ఆకర్షణీయమైన విండ్‌ షీల్డ్‌తో పాటు వెనుకవైపు సీట్లకు గ్లాస్‌ రూఫ్‌తో ఈ కారను ఆకట్టుకుంటుంది. 

లూసిడ్‌ గ్రావిటీ ఇంటీరియర్‌ చాలా విశాలంగా ఉంటుంది. ఏకంగా క్యాబిన్‌ 34 అంగుళాల స్క్రీన్‌ డ్రైవర్‌ వైపు డాష్‌బోర్డులో ఎక్కువ భాగాన్ని కవర్‌ చేస్తుంది. పైగా ఈ స్క్రీన్‌ డిజిటల్‌ ఇనుస్ట్రమెంటల్‌ క్లస్టర్‌గా కూడా పని చేస్తుంది. సెంట్రల్‌ కన్సోల్‌ ఈవీ పైలెట్‌ ప్యానల్‌గా ఉంటూ కారు విధులు, సిస్టమ్‌లకు యాక్సెస్‌ను ఇస్తుంది. అయితే లుసిడ్‌ గ్రావిటీకు సంబంధించిన బ్యాటరీ ప్యాక్‌ వివరాలను తెలుపలేదు. అయితే 88 కేడబ్ల్యూహెచ్‌ నుంచి 118 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీను వాడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రావిటీ ఓ సారి చార్జ్‌ చేస్తే ఏకంగా 708 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. అలాగే కార్‌ 900 కేడబ్ల్యూ ఆన్‌ బోర్డ్‌ చార్జర్‌ను ఉపయోగిస్తుంది. అలాగే ఈ కారు కేవలం 3.5 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 300 కిలో మీటర్ల పరిధిని పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?