Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hey Bike: మార్కెట్‌లోకి మరో నయా ఈ-బైక్.. వేగంలో దీనికి మించింది లేదు.. గంటకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో? తెలుసా?

హే బైక్ కంపెనీ రిలీజ్ చేసిన రేంజర్ ఎస్ ప్రస్తుతం మార్కెట్‌లో దుమ్ము రేపుతుంది. ఈ బైక్ యూఎస్ మార్కెట్‌లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఈ బైక్ ఇతర దేశాల మార్కెట్‌లోకి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Hey Bike: మార్కెట్‌లోకి మరో నయా ఈ-బైక్.. వేగంలో దీనికి మించింది లేదు.. గంటకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందో? తెలుసా?
Heybike
Follow us
Srinu

|

Updated on: May 05, 2023 | 10:30 PM

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లను నడపడానికి ఇష్టపడుతున్నారు. హే బైక్ కంపెనీ రిలీజ్ చేసిన రేంజర్ ఎస్ ప్రస్తుతం మార్కెట్‌లో దుమ్ము రేపుతుంది. ఈ బైక్ యూఎస్ మార్కెట్‌లో విపరీతమైన ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఈ బైక్ ఇతర దేశాల మార్కెట్‌లోకి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ బైక్‌లో సాంకేతిక వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. ఈ బైక్‌ సరికొత్త డిజైన్‌,. ఇంజన్‌ల కారణంగా దీర్ఘకాలంలో అద్భుతమైన పనితీరును అందిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఓ సారి చార్జ్ చేస్తే 89 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే గంటకు 45 కిలో మీటర్ల వేగంతో వెళ్తుంది. ఈ బైక్‌ను చార్జ్ చేయడానికి 5 నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. 

హే బైక్ రేంజర్ ఎస్ ప్రస్తుతం అమెరికాలో విడుదల చేసింనందును దీని ధర డాలర్ల రూపంలో తెలుస్తుంది. ఈ బైక్ సుమారు 1499 డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఇండియాలో ఇంపోర్ట్ చార్జీలు, ఇతర చార్జీలతో కలిపి ఈ బైక్ మరింత ఖరదైనదిగా అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్ ఆ కంపెనీ అధికారిక వెభ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలను అక్కడ పొందవచ్చు. అలాగే ఈ బైక్ 750 వాట్స్ మోటర్‌తో శక్తిని పొందుతుంది. అలాగే ఈ బైక్‌లో 48 వీ, 15 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అయితే ఈ బైక్ గురించి మరిన్ని వివరాల కోసం మరికొంత సమయం వేచి ఉండాలి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..