Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Udchalo E-Bike: మార్కెట్‌లోకి సరికొత్త ఈ-బైక్.. సాయుధ దళాలకు ప్రత్యేక డిస్కౌంట్

దేశ రక్షణ కోసం కష్టపడే సైనికుల స్ఫూర్తితో ఉడ్‌చలో అనే సంస్థ కొత్త ఈ-బైక్‌ను రిలీజ్ చేసింది. విర్ అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ ముఖ్యంగా సైనికుల స్ఫూర్తిని ఉద్దేశించే రూపొందించామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Udchalo E-Bike: మార్కెట్‌లోకి సరికొత్త ఈ-బైక్.. సాయుధ దళాలకు ప్రత్యేక డిస్కౌంట్
Vir Bike 1
Follow us
Srinu

|

Updated on: Apr 23, 2023 | 8:30 PM

దేశ రక్షణ కోసం సైనికుల సేవలు మనం ఎన్ని చెప్పినా తక్కువే. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఉద్యోగానికే అంకితమై వారు చేసే సేవలు మాటల్లో చెప్పలేనివి. ఒక్కోసారి కఠినమైన పరిస్థితుల్లో కిలోమీటర్ల మేర దేశ సరిహద్దుల్లో నడవాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది. దేశ రక్షణ కోసం కష్టపడే సైనికుల స్ఫూర్తితో ఉడ్‌చలో అనే సంస్థ కొత్త ఈ-బైక్‌ను రిలీజ్ చేసింది. విర్ అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ ముఖ్యంగా సైనికుల స్ఫూర్తిని ఉద్దేశించే రూపొందించామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. భారతీయులందరికీ స్థిరమైన, సరసమైన రవాణా ఎంపికలను అందించడానికి కంపెనీ ఈ పర్యావరణ అనుకూల వాహనాన్ని పరిచయం చేసింది. సాయుధ దళాల ధైర్యాన్ని సూచించడమే కాకుండా విర్ అనే పేరు వీ=ఐఆర్ నుంచి ప్రేరణ పొందింది. ఇది భౌతిక శాస్త్రంలో ఓం నియమం. ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లో వోల్టేజ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. 

విర్ బైక్ సహ వ్యవస్థాపకుడు, ఆర్అండ్డీ హెడ్ సాహిల్ ఉత్తేకర్ ఈ బైక్ గురించి మాట్లాడుతూ ఈ బైక్ పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాకుండా కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకోగలదని అన్నారు. ఈ బైక్ ఐపీ రేటింగ్ 65-67 మధ్య ఉంటుందని వివరించారు. మన్నికైన తేలికపాటి ఫ్రేమ్‌తో ఎలక్ట్రిక్ కట్-ఆఫ్‌తో కూడిన డిస్క్ బ్రేక్, సర్దుబాటు చేయగల సీటుతో వినియోగదారుడికి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా నినాదానికి అనుగుణంగా ఈ-బైక్ భారతదేశంలో దొరికే ఉత్పత్తులతోనే రూపొందించామని వివరించారు. విర్ బైక్‌ను సాయుధ దళాలకు రూ. 25,995, భారతదేశంలోని మిగిలిన వారికి రూ. 27,995 ధరకు అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..