Amazon Offers: బంపర్ ఆఫర్.. ఐఫోన్ 14 మోడల్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. జస్ట్ రూ. 67 వేలకే..!

Amazon Apple Sale Days: ఐఫోన్ కొనాలని చాలా మంది భావిస్తారు. అయితే, ధాని ధర కారణంగా వెనుకడుగు వేస్తారు. ఇలాంటి వారి కోసమే అమేజాన్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. అమేజాన్ ఆపిల్ సేల్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్ ఇస్తోంది. అవును, ఎప్పటి నుంచో ఐఫోన్ కొనాలని భావిస్తూ..

Amazon Offers: బంపర్ ఆఫర్.. ఐఫోన్ 14 మోడల్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. జస్ట్ రూ. 67 వేలకే..!
Apple Iphone 14
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 13, 2023 | 10:38 AM

Amazon Apple Sale Days: ఐఫోన్ కొనాలని చాలా మంది భావిస్తారు. అయితే, ధాని ధర కారణంగా వెనుకడుగు వేస్తారు. ఇలాంటి వారి కోసమే అమేజాన్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. అమేజాన్ ఆపిల్ సేల్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్ ఇస్తోంది. అవును, ఎప్పటి నుంచో ఐఫోన్ కొనాలని భావిస్తూ.. లోటు బడ్జెట్ కారణంగా వెనుకడుగు వేస్తున్న వారు టెన్షన్ లేకుండా ఇప్పుడు మొబైల్ కొనేయొచ్చు. అతి తక్కువ ధరకే అమెజాన్‌లో ఆపిల్ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ జూన్ 17 వరకు మాత్రమే ఉంటుంది. మరి ఆపిల్ ఫోన్స్‌పై అమేజాన్ అందిస్తున్న ఆఫర్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం..

అమేజాన్ ఆపిల్ సేల్ డేస్ ఆఫర్స్..

1. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఉన్నాయి. అమెజాన్‌లో ఆపిల్ సేల్ డేస్ సందర్భంగా ఈ మోడళ్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

2. 128GB iPhone 14 మోడల్‌ను కేవలం రూ. 67,999 లకే పొందే అవకాశం ఉంది. వాస్తవానికి దీన ధర రూ. 79,999 ఉంది. అంటే, కొనుగోలుదారులు 15 శాతం తగ్గింపు ప్రయోజనం పొందనున్నారు.

ఇవి కూడా చదవండి

3. అదేవిధంగా, iPhone 14 256GB వేరియంట్ 13 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 89,900 నుండి రూ. 77,999కి తగ్గింది. 512GB స్టోరేజ్‌తో iPhone 14ని కొనుగోలు చేస్తే 11 శాతం డిస్కౌంట్ పొందుతారు. అంటే.. రూ.97,999కి అందుబాటులో ఉంది.

4. iPhone 14 Plus 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 89,900 కగా, 14 శాతం తగ్గింపుతో రూ.76,999కి కొనుగోలు చేయవచ్చు.

5. iPhone 14 Pro Maxపై 9 శాతం డిస్కౌంట్ ఇస్తోంది అమేజాన్. 128GB వేరియంట్ అసలు ధర రూ.1,29,900 కాగా, 256GB వేరియంట్ ధర రూ.1,39,900. డిస్కౌంట్ తరువాత ఈ రెండు మోడళ్లను రూ.1,19,999, రూ.1,34,990కి కొనుగోలు చేయవచ్చు.

ఇదిలాఉంటే.. అమెజాన్ ఈ సేల్‌లో.. ఆపిల్ మోడళ్లన్నింటిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ పాత ఫోన్ పరిస్థితి, మోడల్, బ్యాటరీపై ఆధారపడి ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫర్లతో వీటి ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..