Cooking Oil: వినియోగదారులకు గుడ్ న్యూస్.. లీటర్ నూనెకు రూ.10 తగ్గించిన ప్రముఖ కంపెనీ..
Cooking Oil: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఈ రోజు తన ఎడిబుల్ ఆయిల్ ధరలను లీటరుకు రూ.10 తగ్గించింది. దీనికి సంబంధించి కంపెనీ ఒక ప్రకటన కూడా చేసింది.
Cooking Oil: ఎఫ్‌ఎంసీజీ సంస్థ అదానీ విల్‌మార్ ఈ రోజు తన ఎడిబుల్ ఆయిల్ ధరలను లీటరుకు రూ.10 తగ్గించింది. అదానీ విల్మర్ ఒక లీటర్ ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ప్యాక్ గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి)ని రూ.220 నుంచి రూ.210కి తగ్గించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఫార్చూన్ సోయాబీన్, ఫార్చూన్ కచ్చి ఘనీ (మస్టర్డ్ ఆయిల్) లీటర్ ప్యాక్ ఎంఆర్‌పీ రూ.205 నుంచి రూ.195కి తగ్గింది. కొత్త ధరలతో కూడిన ప్యాకెట్లు త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్లనే వెజిటబుల్ ఆయిల్ ధరల్లో ఈ తగ్గుదలకు కారణమని కంపెనీ వెల్లడించింది. తగ్గిన ధరలను తమ వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
శనివారం ఢిల్లీ నూనె గింజల మార్కెట్‌లో ఆవాలు, సోయాబీన్ బలహీనమైన డిమాండ్ ఉంది. దాదాపు అన్ని ఎడిబుల్ ఆయిల్స్‌కు డిమాండ్ చాలా తక్కువగా ఉందని వ్యాపారులు తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎడిబుల్ ఆయిల్ ధరల్లో దాదాపు 20 శాతం తగ్గుదల నమోదైంది. రెండవ దిగుమతిదారైన భారత్.. ఆరు నెలల క్రితం వంట నూనెలను కొనుగోలు చేసి ఇప్పుడు ఎక్కువ చెల్లిచాల్సి వస్తోంది. వంట నూనెల ధరల పతనానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.