2021 Budget: ‘బడ్జెట్’ ఎందుకు రూపొందిస్తారో తెలుసా ? దానిని ఎప్పుడు ప్రవేశపెడతారంటే..

బడ్జెట్.. సాధరణంగా ప్రభుత్వాలు బడ్జెట్‏ను ప్రవేశపెడుతుంటాయని చాలా మందికి తెలిసిన విషయం. బడ్జెట్ పెట్టడానికి ముందు

2021 Budget: 'బడ్జెట్' ఎందుకు రూపొందిస్తారో తెలుసా ? దానిని ఎప్పుడు ప్రవేశపెడతారంటే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 20, 2021 | 4:55 PM

బడ్జెట్.. సాధరణంగా ప్రభుత్వాలు బడ్జెట్‏ను ప్రవేశపెడుతుంటాయని చాలా మందికి తెలిసిన విషయం. బడ్జెట్ పెట్టడానికి ముందు అందులో ఏ పరిశ్రమకు ఎంత కేటాయిస్తున్నారు అనే విషయాలపైనే చర్చలు జరుగుతుంటాయి. కానీ అసలు బడ్జెట్ అంటే ఏంటీ అనేది దాదాపు తెలియకపోయిన ప్రభుత్వాలు ప్రవేశపెడతాయని మాత్రమే తెలుసు. సాధరణంగా బడ్జెట్ అనే పదాన్ని మనం విరివిగా వాడుతుంటాం. ఇక మధ్యతరగతి ప్రజలు తన నెలసరి ఆదాయం, చేయాల్సిన ఖర్చులకు సంబంధించి ఓక నివేధక తయారు చేసుకుంటారు. దాని ప్రకారంగానే ఖర్చులు జరుపుతుంటారు. అలాగే ప్రభుత్వాలు కూడా తామకు వచ్చిన ఆదాయం అందులో నుంచి చేసే ఖర్చుల వివరాలను మొత్తం ఒక నివేదిక తయారు చేస్తారు. ప్రస్తుతం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బడ్జెట్.. సాధరణంగా ఏప్రిల్- మార్చి మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది.. వీటితోపాటు ఎన్ని ఖర్చులు ఉంటాయి ? అనే అంశాలతో ఒక బడ్జెట్‏ను రూపొందిస్తారు. ఇందులో ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయం, ఖర్చుల వివరాలను పొందుపరుస్తారు. దీనినే ‘బడ్జెట్’ అంటారు.

భారత్‏లో ప్రతీ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్న తేదీ మారుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇక 2017 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‏ను ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఇంతకు ముందు ఈ బడ్జెట్‏ను ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టేవారు. అలాగే దీనిని కేంద్ర ఆర్థక మంత్రి ప్రవేశపెడతారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రవేశపెడుతున్నారు. అలాగే ఈ ఏడాది కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక ఈసారి ఫిబ్రవరి 1న మళ్ళీ తనే ఆవిష్కరించనుంది. అయితే బడ్జెట్ ఎందుకు ప్రవేశ పెడతారంటే.. ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల నిర్వహణ సులభతరం కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు కూడా సజావుగా కొనసాగుతాయి. బడ్జెట్‏లో లక్ష్యాలను కూడా నిర్దేశించుకోవచ్చు. అంతేకాకుండా వాటిని నిర్వహించడానికి కేటాయింపులు కూడా చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ? ఎంత ఖర్చు పెడుతున్నాం ? సందేహాలను చాలా నివృత్తి చేసుకోవచ్చు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును కూడా పర్యవేక్షించవచ్చు.

Also Read:

కీలక నిర్ణయం తీసుకున్న ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల కోసం రెడీ-టు-ఈట్-మీల్స్.. సన్నాహాలు చేస్తున్న ఐఆర్‏సీటీసీ..

2021 బడ్జెట్.. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఎంతవరకు ఉపశమనం లభించనుంది.. నిపుణులెమంటున్నారు ?