పార్లమెంటులో బడ్జెట్ ను ప్రతిపాదించనున్న కేంద్రం, ఎన్నో సవాళ్లు, పరిష్కారానికి నిధుల వెల్లువతో ప్రయత్నాలు

పార్లమెంటులో బడ్జెట్ ను ప్రతిపాదించనున్న కేంద్రం, ఎన్నో సవాళ్లు, పరిష్కారానికి నిధుల వెల్లువతో ప్రయత్నాలు

2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనికి ముందు ప్రధాని మోదీ ఈ నెల 30 న జరిగే అఖిల పక్ష సమావేశానికి..

Umakanth Rao

| Edited By: Team Veegam

Jan 22, 2021 | 4:42 PM

2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనికి ముందు ప్రధాని మోదీ ఈ నెల 30 న జరిగే అఖిల పక్ష సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం వర్చ్యువల్ గా జరుగుతుందని, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ఫిబ్రవరి 1 న ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. దేశం ఇప్పుడిప్పుడే కోవిడ్ 19 బారి నుంచి కోలుకుంటున్న వేళ ఆర్థిక పునరుజ్జీవనానికి ఆమె పలు చర్యలు, ప్రతిపాదనలు ప్రకటించవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల నుంచి ఉద్యోగావకాశాల కల్పన, హెల్త్ కేర్, గృహ నిర్మాణ రంగం..ఇలా పలు రంగాలపై ఆమె దృష్టి పెట్టవచ్చు.

ఇన్ కమ్ టాక్స్ డిడక్షన్స్

కోవిడ్ 19 కారణంగా దేశంలో లక్షలాది మంది తమ ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. వేతనాలలో కోత కూడా తప్పలేదు. దీంతో ఆర్ధిక మంత్రి ఆత్మనిర్భర్ పథకం కింద పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచవచ్చు ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి వర్గాలు తమ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నాయి. ఇక… .అలాగే హయ్యర్ స్టాండర్డ్ డిడక్షన్ (ఆదాయపు  పన్నుతో సంబంధం లేని వేతనం) ను ప్రస్తుతమున్న 50 వేల నుంచి 75 వేలు లేదా లక్ష రూపాయలవరకు పెంచే సూచనలు ఉన్నాయి. అధిక ఆదాయం పొందుతున్నవారిపై కోవిడ్ సెస్ విధించే యోచన కూడా ఉంది. మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే విధంగా  హౌసింగ్ రంగంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అంటున్నారు. ఇళ్ళు కొనుగోలు చేయాలనుకునేవారికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ నిబంధనలను సర్కార్ సరళీకృతం చేస్తుందని భావిస్తున్నారు. కొత్త బడ్జెట్ లో క్రెడిట్ తో కూడిన సబ్సిడీని ఇవ్వవచ్చు.

డెవలప్ మెంట్ ఫైనాన్స్ ఇన్స్ టి ట్యుషన్ ని ప్రతిపాదిస్తారని కూడా భావిస్తున్నారు. ఈ  నూతన సంస్థ 100 లక్షల కోట్ల విలువైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ (కొత్తవి లేదా ప్రస్తుతమున్నవి) ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుంది. హెల్త్ కేర్ కు సంబంధించి సెక్షన్ 80 డీ కింద మెడి క్లెయిమ్ ప్రీమియం ను 50 వేలవరకు పెంచుతారని ఆశిస్తున్నారు.

ఇంకా ఆర్ధిక లోటును భర్తీ చేసుకునేందుకు కేంద్ర ఆర్ధికమంత్రి పలు ప్రతిపాదనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu