AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BUDGET-2021: స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా.. అమలులో ఉన్నది ఏడున్నర నెలలు మాత్రమే.. తొలి పద్దుల విశేషాలు..

Shanmukham Chetty Budget : భారత దేశ మొదటి బడ్జెట్‌ను అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

BUDGET-2021: స్వతంత్ర భారత్ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా.. అమలులో ఉన్నది ఏడున్నర నెలలు మాత్రమే.. తొలి పద్దుల విశేషాలు..
uppula Raju
| Edited By: |

Updated on: Feb 01, 2021 | 10:24 AM

Share

Shanmukham Chetty Budget : భారత దేశ మొదటి బడ్జెట్‌ను అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు అంటే.. ఏడున్నర నెలలకు మాత్రమే ఈ బడ్జెట్ అమలులో ఉంది. ఆదాయ అంచనా రూ.171.15 కోట్లలో కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు, సాధారణ వసూళ్ల నుంచి రూ.88.5 కోట్లు, పోస్టు, టెలిగ్రాఫ్‌ల శాఖ నుంచి ఆదాయం రూ.15.9 కోట్లు, ఖర్చు, వడ్డీ రూ.13.9 కోట్లు, నికర మిగులు అంచనా రూ.2 కోట్లుగా నిర్ధారించారు. ఇక ఖర్చు విషయానికొస్తే.. రూ.197.39 కోట్లలో.. రూ.92.74 కోట్లు రక్షణ సేవలకు పోను మిగతాది పౌర ఖర్చులకు కేటాయించారు. విభజన కారణంగా రక్షణ రంగానికి సాధారణం కంటే ఎక్కువ ఖర్చవుతుందని తెలిపారు.

భారత ప్రభుత్వం, బ్రిటీష్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం వివరాలను కొద్ది రోజుల కిందటే సభ ముందు ప్రవేశపెట్టారు. స్టెర్లింగ్ పద్దు (విదేశీ మారక నిల్వలు) కింద 1946 ఏప్రిల్ 5 నాటికి అత్యధికంగా రూ.1733 కోట్లు ఉండగా.. అవి 1947 మార్చి నాటికి రూ.1612 కోట్లకు తగ్గిపోయాయి. జూలైలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాక అవి రూ.1547 కోట్లుగా ఉన్నాయి. ఆరు నెలల్లోనే రూ.65 కోట్లు తీసుకున్నారు. స్టెర్లింగ్ పద్దు నుంచే డబ్బులు తీసుకోకుంటే తగిన దిగుమతులు చేసుకోకుంటే మన దేశం యుద్ధం సమయంలో ఆకలితో అలమటించాల్సి వచ్చేదని షణ్ముఖం వివరించారు.

ఇక డాలర్ పూల్ పద్దు కింద 1939 సెప్టెంబర్ నుంచి 1946 మార్చి 31వ తేదీ వరకు రూ.405 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు సంపాదించి, రూ.240 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు ఖర్చు చేశాం. రూ.165 కోట్లు మిగిలాయి. ఇదే సమయంలో కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోర్చుగల్ దేశాల కరెన్సీల్లో రూ.51 కోట్లు ఖర్చు చేయగా, ఇంకా రూ.114 కోట్లు మిగిలాయి. యుద్ధం తర్వాత ప్రణాళిక, అభివృద్ధి పద్దు కింద రూ.100 కోట్లు పెట్టగా, అందులో రూ.45 కోట్లు ప్రావిన్సులకు గ్రాంటులుగా ఇచ్చామని షణ్ముఖం తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

బడ్జెట్ లైవ్ దిగువన చూడండి…

లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై మారటోరియం.. నెల రోజుల పాటు ఇవే ఆర్బీఐ నిబంధనలు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్