యూపీ ఇస్కాన్‌లో కరోనా కల్లోలం.. ఆలయం మూసివేత!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో యూపీలోని బృందావన్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ చైతన్య (ఇస్కాన్) ఆలయాన్ని శ్రీకృష్ణాష్టమికి ఒక్కరోజు ముందు

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో యూపీలోని బృందావన్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ చైతన్య (ఇస్కాన్) ఆలయాన్ని శ్రీకృష్ణాష్టమికి ఒక్కరోజు ముందు మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయ పూజారితోపాటు 22 మంది కరోనా బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆలయంలో పనిచేసే వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేయగా పూజారితోపాటు 22 మంది వైరస్ బారినపడినట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
బాధితులందరిని ఐసోలేషన్లో ఉంచామని, ఆలయంలోకి ఎవ్వరూ రాకుండా నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం శ్రీకృష్ణాష్టమి జరుపుకోనున్న సంగతి తెలిసిందే. పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని, విష్ణుమూర్తి ఎనిమిదో అవతారం అని నమ్ముతారు. హిందూ సంప్రదాయం ప్రకారం భాద్రపద మాసంలోని ఎనిమిదో రోజు వచ్చే అష్టమి తిథిని శ్రీకృష్ణాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితి.
[svt-event date=”11/08/2020,2:44PM” class=”svt-cd-green” ]
ISKCON Temple in Vrindavan sealed after 22 people, including priests, from the temple tested positive for #COVID19, ahead of #Janmashtami.
Official says,”Movement of people has been restricted and the temple has been sealed.” pic.twitter.com/K646uuJePU
— ANI UP (@ANINewsUP) August 11, 2020
[/svt-event]
Read More:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పీహెచ్‌సీల్లో 24 గంటల సేవలు..