పొడిగింపు…హైకోర్టు సంచలన నిర్ణయం..
కరోనా విజృంభణ మునుపటి కంటే ఇంకా ఎక్కువగా సాగుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్‌ను మరోసారి...
TS High Court Extends Lockdown in Courts : కరోనా విజృంభణ మునుపటి కంటే ఇంకా ఎక్కువగా సాగుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. తెలంగాణ న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది. రాష్ట్రంలో కోర్టుల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అత్యవసర, తుది విచారణ కేసులు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని జిల్లా కోర్టులకు ఉత్తర్వులో పేర్కొంది. జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్ కూడా సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా… ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.