AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ నూతన పారిశ్రామిక విధానంపై య‌న‌మల తీవ్ర‌ విమ‌ర్శ‌లు

నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమ‌ర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ కొత్త ఇండ‌స్ట్రీయ‌ల్ పాల‌సీలోని లోటుపాట్ల‌ను ఎత్తిచూపారు.

ఏపీ నూతన పారిశ్రామిక విధానంపై య‌న‌మల తీవ్ర‌ విమ‌ర్శ‌లు
Yanamala Rama Krishnudu
Ram Naramaneni
|

Updated on: Aug 11, 2020 | 2:27 PM

Share

Yanamala Comments On AP New Industrial Policy : నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి పెద్ద‌గా ఉప‌యోగం లేద‌ని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమ‌ర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ కొత్త ఇండ‌స్ట్రీయ‌ల్ పాల‌సీలోని లోటుపాట్ల‌ను ఎత్తిచూపారు. దీనివ‌ల్ల‌ భవిష్యత్ తరాలకు, ఉపాధి కల్పనకు పెద్ద‌గా ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. 14నెలల విలువైన కాలం వృధా చేసింది ఈ పాలసీ కోసమా ..? అని ప్రశ్నించారు. ఏపీ స‌ర్కార్ చేసే ప‌నుల వ‌ల్లే పారిశ్రామికరంగంలో మైనస్ 2.2% వృద్ధి సాధించారని విమ‌ర్శించారు. నిర్మాణ రంగం, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలన్నీ తిరోగమనంలోనే ప‌య‌నిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ 14నెలల కాలంలో లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి దిక్కులేనివారు అయ్యార‌ని ఆరోపించారు. చివరికి గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులకు కూడా సగం శాల‌రీసే ఇస్తున్నార‌ని మండిపడ్డారు. క్రెడిట్ రేటింగ్ పడిపోయి…ఇన్వెస్ట్‌మెంట్స్ అని వేరే రాష్ట్రాల‌కు త‌ర‌లిపోయాయ‌ని పేర్కొన్నారు. ఏపీకి గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను వైసీపీ లీడ‌ర్స్ నాశనం చేశారని ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవ‌కాశాల్ని వైసీపీ స‌ర్కార్ నీరుగార్చింద‌ని, దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని యనమల హెచ్చ‌రించారు.

Also Read : మ‌ల‌ప్పురం ప్ర‌జ‌ల మాన‌వ‌త్వానికి ఎయిర్ ఇండియా స‌లాం

ఊరంతా ఒకటే పేరు..గూళ్యం గ్రామ ప్రత్యేక నామకరణ సంప్రదాయం తెలిస్తే
ఊరంతా ఒకటే పేరు..గూళ్యం గ్రామ ప్రత్యేక నామకరణ సంప్రదాయం తెలిస్తే
ప్రయాణికుల మనసులు దోచేస్తున్న ఆర్టీసీ..
ప్రయాణికుల మనసులు దోచేస్తున్న ఆర్టీసీ..
భార్యాభర్తల కోసం బెస్ట్ స్కీమ్‌.. రూ.2 లక్షలపై రూ.90 వేల వడ్డీ
భార్యాభర్తల కోసం బెస్ట్ స్కీమ్‌.. రూ.2 లక్షలపై రూ.90 వేల వడ్డీ
ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే ?
ఐపీఎల్ 2026 వేలం ఎప్పుడు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే ?
భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!
భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..!
డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులే..
డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులను పూర్తి చేయండి.. లేకుంటే ఇబ్బందులే..
మరణించిన వ్యక్తి బంధువులలో ఎవరు తల గుండు చేయించుకోవాలి..?
మరణించిన వ్యక్తి బంధువులలో ఎవరు తల గుండు చేయించుకోవాలి..?
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్-దక్షిణాఫ్రికా మొదటి టీ20లో ఐదు భారీ రికార్డులు బ్రేక్
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!