పంచాంగకర్తలు విభేదాలు వీడాలి..: స్వరూపానందేంద్ర సరస్వతీ

పంచాంగకర్తలు విభేదాలు వీడాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ సూచించారు. పండుగల విషయంలో ఏకాభిప్రాయంతో పంచాంగాలను రూపొందించాలని కోరారు. శారదా పీఠంలో అర్చక ట్రైనింగ్‌....

పంచాంగకర్తలు విభేదాలు వీడాలి..: స్వరూపానందేంద్ర సరస్వతీ
Follow us

|

Updated on: Oct 11, 2020 | 7:07 PM

Visakha Sarada Peetham Swami : పంచాంగకర్తలు విభేదాలు వీడాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ సూచించారు. పండుగల విషయంలో ఏకాభిప్రాయంతో పంచాంగాలను రూపొందించాలని కోరారు. శారదా పీఠంలో అర్చక ట్రైనింగ్‌ అకాడమీ తరఫున నిర్వహించిన దైవజ్ఞ సమ్మేళనాన్ని ఉద్దేశించి స్వరూపానందేంద్ర సరస్వతీ మాట్లాడారు.

పండుగలపై భేదాభిప్రాయాలతో అటు ప్రభుత్వాలతో పాటు ఇటు హిందూ దేవాలయ వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని స్వరూపానందేంద్ర అన్నారు. హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఏకాభిప్రాయంతో పంచాంగాలను రూపొందించాలన్నారు. ఈ ఏడాది పండుగల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా పంచాంగకర్తలు తీర్మానం చేయాలని స్వామీజీ సూచించారు. వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాలకు చెందిన పంచాంగకర్తలతో పెద్ద ఎత్తున దైవజ్ఞ సమ్మేళనం నిర్వహణకు సంకల్పించినట్టు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ చెప్పారు.