AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై వెనక్కు తగ్గిన ట్రంప్

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ఉత్తర్వులపై ట్రంప్‌ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. మెరిట్ ఆధారంగా వీసాలు ఇచ్చే ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై త్వరలో తాను సంతకాలు చేయనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. డీఏసీఏ ప్రోగ్రామ్ కింద అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వలసదారుల పిల్లలను సంరక్షిస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై వెనక్కు తగ్గిన ట్రంప్
Balaraju Goud
|

Updated on: Jul 15, 2020 | 2:45 PM

Share

ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ఉత్తర్వులపై ట్రంప్‌ ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. మెరిట్ ఆధారంగా వీసాలు ఇచ్చే ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై త్వరలో తాను సంతకాలు చేయనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తెలిపారు. డీఏసీఏ ప్రోగ్రామ్ కింద అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వలసదారుల పిల్లలను సంరక్షిస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు పేర్కొన్నారు.

అతి త్వరలో ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై సంతకాలు చేయనున్నామని స్పష్టం చేశారు ట్రంప్. మెరిట్ ఆధారంగా తీసుకొస్తున్న ఈ విధానం చాలా బలంగా ఉంటుందని.. డిఫర్డ్‌ యాక్షన్ ఫర్ చైల్డ్‌వుడ్ అరైవల్స్‌పై మేం పని చేయనున్నట్లు వెల్లడించారు. డీఏసీఏ వల్ల తమకు మేలు జరుగుతుందని కన్జర్వేటివ్ రిపబ్లికన్స్‌ కూడా ఎదురు చూస్తున్నారని, దీనిపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. శక్తిమంతమైన ఇమ్మిగ్రేషన్ యాక్ట్‌పై మేం సంతకాలు చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీని కోసం దేశం 25 నుంచి 30 ఏళ్లుగా యత్నిస్తోందని.. ముఖ్యంగా బార్డర్‌‌లో ఇది సమర్థంగా పని చేయనుందన్నారు. దేశంలోకి వచ్చిన వలసదారుల పిల్లలను సంరక్షిస్తామని, వారి క్షేమాన్ని డీఏసీఏ రిపబ్లికన్‌ల తరహాలో చాలా బాగా చూసుకుంటుందని ట్రంప్ చెప్పారు.

అయితే, మంగళవారం ఆయన పాలకవర్గం మసాచుసెట్స్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు న్యాయమూర్తి అలిసన్‌ డి బరోకు తెలిపింది. ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ యూనివర్సిటీలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై వాదనలు వినిపిస్తూ ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అటార్నీ జనరల్‌ కోర్టుకు వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయించింది. దీన్ని సవాల్‌ చేస్తూ అమెరికా వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం ఎనిమిది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దాదాపు 200 పైగా విద్యా సంస్థలు వీటిపై సంతకాలు చేశాయి. హార్వర్డ్‌, ఎంఐటీ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలు సైతం ఈ విషయంపై కోర్టుకు వెళ్లాయి. వీరికి సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలూ కూడా మద్దతు పలికాయి. ఆన్‌లైన్‌ తరగతులపై ఉన్న పరిమితుల్ని ఎత్తివేస్తూ మార్చి 13న ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయానికి ట్రంప్‌ తాజా ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని కోర్టులో వాదనలు వినిపించాయి హార్వర్డ్‌, ఎంఐటీ యూనివర్సిటీ తరపు న్యాయవాదులు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లాలని ట్రంప్‌ జులై 6న ఆదేశాలు జారీ చేశారు. లేదంటే విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే విద్యాబోధన అందించే వర్సిటీలకు మారాలని సూచించారు. దీంతో ప్రాంగణ కోర్సులు అందించే విద్యాసంస్థలకు మారడమా లేక స్వదేశానికి తిరుగు ప్రయాణం కట్టడమా తేల్చుకోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. దీంతో ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులతోపాటు, ఎం-1 వీసాపై వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్నవారు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మూతపడ్డ విద్యాసంస్థల్ని ఎలాగైనా తెరిపించాలన్న దురుద్దేశంతోనే ట్రంప్‌ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ట్రంప్‌ తీసుకున్న తాజా నిర్ణయం విద్యార్థులకు ఊరట కలిగించింది.

Follow Us