ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ

అనంతపురం జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. అరుదైన విధంగా జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ వైద్యురాలు కూడా వుంది.

  • Rajesh Sharma
  • Publish Date - 1:53 pm, Sat, 31 October 20
ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ

Three bikes colluded with one car: ఒకే కారును మూడు బైకులు ఢీకొన్న అరుదైన ఘోర రోడ్డు ప్రమాదం అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగింది. గోళ్ళ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ఒకరితోపాటు ఇద్దరు బైక్ రైడర్లు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోళ్ళ గ్రామం వద్ద నేషనల్ హైవేపై ప్రమాదవశాత్తు మూడు మోటార్ బైకులు ఒకే కారును ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న సివిల్ సర్జన్ డాక్టర్ శివ మాధవితోపాటు బైకులను నడుపుతున్న ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు కల్యాణదుర్గం పోలీసులు.

ALSO READ:  సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు

ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు