వాళ్లకు కొంచెం కూడా బుర్ర లేదు: మోడీ
జామ్ నగర్: ప్రతిపక్ష నేతలకు కొంచెం కూడా బుర్ర లేదని ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాక్ దేశాల మధ్య జరిగిన పోరాటంలో రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే మనకు గొప్ప ఆధిక్యం దక్కేదని తాను అంటే, అందుకు ప్రతిపక్షాలు మన వాయిసేన సత్తాను ప్రధాని శంకిస్తున్నారని ప్రచారం చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు. ఈ విషయంలో మోడీ అసహనం వ్యక్తం చేస్తూ రఫేల్ యుద్ధ విమానాలు […]

జామ్ నగర్: ప్రతిపక్ష నేతలకు కొంచెం కూడా బుర్ర లేదని ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేశారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాక్ దేశాల మధ్య జరిగిన పోరాటంలో రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే మనకు గొప్ప ఆధిక్యం దక్కేదని తాను అంటే, అందుకు ప్రతిపక్షాలు మన వాయిసేన సత్తాను ప్రధాని శంకిస్తున్నారని ప్రచారం చేస్తున్నాయని మోడీ మండిపడ్డారు.
ఈ విషయంలో మోడీ అసహనం వ్యక్తం చేస్తూ రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే మన విమానం ఒక్కటి కూడా కూలిపోయేది కాదనే ఉద్దేశంతో అన్నానని చెప్పారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని విపక్షాలకు సూచించారు. ఇప్పటికి కూడా కొందరు మన సైన్యం సత్తాను సందేహిస్తున్నారని ప్రధాని మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.



