చావులోనూ వీడనీ అన్నదమ్ముళ్ల బంధం
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చావు కూడా అన్నదమ్ములను విడదీయలేకపోయింది. అన్న చనిపోయాడని తెలుసుకున్న కొద్ది సేపటికే తమ్ముడు అమరుడయ్యాడు.
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చావు కూడా అన్నదమ్ములను విడదీయలేకపోయింది. అన్న చనిపోయాడని తెలుసుకున్న కొద్ది సేపటికే తమ్ముడు అమరుడయ్యాడు. శంషాబాద్ మండలం సిద్దాంతి గ్రామానికి చెందిన రాచమల్ల సుదర్శన్ ప్రభుత్వ స్విమ్మింగ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సోమవారం సుదర్శన్ కి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచాడు. అయితే, సుదర్శన్ చనిపోవడం జీర్ణించుకోలేని అతడి తమ్ముడు రాచమల్ల లవన్ కూడా మరణించాడు. అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు లవన్ అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఒకేసారి అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు చనిపోవడంతో ఓ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేకపోయింది.