ఐఐటీ గాంధీనగర్ విద్యార్థుల ఘనత.. ఎక్స్‌రేతో కరోనా టెస్ట్..!
అయితే కరోనా నిర్ధారణకు టెస్టులు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న జనం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. అయితే గాంధీనగర్ ఐఐటీ విద్యార్థుల కొత్త టెక్నాలజీతో కరోనా ఫలితాలను త్వరగా చెసుకోవచ్చని నిరూపిస్తున్నారు. మనిషి శరీర భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనాను గుర్తించవచ్చంటున్నారు.
లక్షలాది మంది అస్పత్రుల పాలవుతున్నారు. అటు కరోనా కట్టడికి ప్రపంచం మొత్తం ఏకధాటిగా పరిశోధనలు చేస్తోంది. అయితే కరోనా నిర్ధారణకు టెస్టులు మాత్రం అంతంతగానే ఉంటున్నాయి. కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న జనం గంటల తరబడి వేచి చూసే పరిస్థితి నెలకొంది. అయితే గాంధీనగర్ ఐఐటీ విద్యార్థుల కొత్త టెక్నాలజీతో కరోనా ఫలితాలను త్వరగా చెసుకోవచ్చని నిరూపిస్తున్నారు. మనిషి శరీర భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనాను గుర్తించవచ్చంటున్నారు. చాతీ భాగంలో ఎక్స్‌రే తీసి, దాన్ని కంప్యూటర్ ఆధారంగా పరిశీలిస్తే కొవిడ్ నియంత్రణకు అవకాశం ఉంటుందంటున్నారు ఐఐటీ విద్యార్థులు. ఇందుకు తగ్గటుగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఒకదానిని రూపొందించినట్లు ఐఐటీ విద్యార్థులు తెలిపారు. ‘డీప్ లెర్నింగ్ టూల్’ యంత్రాన్ని తయారు చేసిన విద్యార్థులు ఎక్స్‌రే ద్వారా కరోనాను నిర్ధారణను తెలుసుకోవచ్చని రీసెర్చ్ టీం మెంబర్ ఎంటెక్ విద్యార్థి కుష్‌పాల్ సింగ్ యాదవ్ తెలిపారు. మెదడులోని నాడి వ్యవస్థ ఆధారంగా అ యంత్రాన్ని తయారు చేశామని.. ప్రజందరికీ అందుబాటులోకి తేవచ్చని విద్యార్థులు చెబుతున్నారు.