నిర్లక్ష్యంగా ఉండేవారిని నిలదీయండి: ప్రధాని మోదీ

ఆరోగ్యాన్ని రక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేసిన ప్రధాని తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. కరోనా విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదన్న మోదీ మాస్క్ ధరించని వారిని నిలదీయాలన్నారు. భౌతిక దూరంతోనే ప్రాణాలకు రక్షణ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

  • Balaraju Goud
  • Publish Date - 4:30 pm, Tue, 30 June 20
నిర్లక్ష్యంగా ఉండేవారిని నిలదీయండి: ప్రధాని మోదీ

దేశంలో విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అన్ లాక్ 1.0 ముగుస్తుందన్న ప్రధాని అన్ లాగ్ 2.0 ప్రవేశించామన్నారు. అన్‌లాక్‌-1 ద‌శ నుంచి కొంత మార్పులు చోటుచేసుకున్న‌ట్లు చెప్పారు. జ‌నం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్ర‌స్తుతం ఎక్క‌వ జాగ్ర‌త్త ప‌డాల్సిన ద‌శ‌లో.. జ‌నం ప‌ట్టింపులేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. లాక్‌డౌన్ వేళ నియ‌మాల‌ను క‌ఠినంగా పాటించాల్సిన అవసరముందన్నారు. ఇకపై ప్రతి ఒక్కరు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గుర్తు చేసిన ప్రధాని తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. కరోనా విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదన్న మోదీ మాస్క్ ధరించని వారిని నిలదీయాలన్నారు. భౌతిక దూరంతోనే ప్రాణాలకు రక్షణ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.