బాలీవుడ్ చీకటి కోణాల గుట్టు విప్పిన శ్రద్ధాదాస్…
అండదండలు లేకుండా బాలీవుడ్ లో పైకి రావడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అని నటి శ్రద్ధాదాస్ తెలిపింది. సినిమాల్లో అవకాశాలు చేజిక్కుంచుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలని వెల్లడించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన ఆమె సినిమా ఇండస్ట్రీలోని పలు చీకటి కోణాలను వెల్లడించింది.

హిందీ చిత్ర పరిశ్రమలో రాణించాలంటే ముంబైలోని బాంద్రా, జుహూలో జరిగే పార్టీలకు, ఖరీదైన పబ్బులకు వెళ్లాలని.. అక్కడున్న వారితో మిత్రులుగా మెలగాలని వెల్లడించింది. వారిని దేవుడి ముందు ఉండే పూజారుతో పోల్చింది శ్రద్ధా. ఇలా ఎన్నో మానసిక ఒత్తుడులు ఎదుర్కొవాల్సి ఉంటుందని.. ఇండస్ట్రీలోని పీఆర్ మేనేజర్లు ఇలాంటి పార్టీలకు వెళ్లకపోతే అవకాశాలు దక్కవంటారని వాపోయింది. డబ్బు లేకపోయినా లగ్జరీ లైఫ్ స్టైల్ తో బ్రతకాలని.. సినీ పెద్దల దృష్టిలో పడేందుకు ఎన్నో తిప్పలు పడాలని పేర్కొంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి, సినీ కుటుంబ నేపథ్యం లేకుండా వచ్చిన వాళ్లు..ఈ పరిస్థితుల మధ్య ఎంతో మానసిక వ్యధ అనుభవిస్తారని తెలిపింది. ఖరీదైన కార్లు, డ్రస్‌లు, పీఆర్ మేనేజర్లు, సెలూన్ స్పా లాంటి ఎన్నో వ్యవహారాలను పాటించాల్సి ఉంటుందని వివరించింది. ఓ దశలో అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామా? అనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేసింది శ్రద్ధాదాస్.
కాగా ప్రస్తుతం టాలీవుడ్లో ‘నిరీక్షణ’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది శ్రద్ధా. గతేడాది కార్తికేయ నటించిన ‘హిప్పీ’లో గెస్ట్ రోల్ చేసింది.