నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే

దాదాపు ఏడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అయితే.. కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గనందున కఠినమైన నిబంధనలతోనే విద్యాసంస్థలను పున: ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్... కండీషన్స్ ఇవే
Rajesh Sharma

|

Oct 29, 2020 | 5:38 PM

Shcools colleges reopening in Andhra: ఏపీ వ్యాప్తంగా నవంబర్‌ రెండవ తేదీ నుంచి పాఠశాలలు, కాలేజీలు పున: ప్రారంభం కానున్నాయి. అయితే.. కోవిడ్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో పటిష్టమైన రక్షణ చర్యలతోనే పాఠశాలలు ప్రారంభించాని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈమేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వెల్లడించారు. .

నవంబర్‌ 2వ తేదీ నుంచి 9,10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. అయితే తరగతులు కేవలం ఒంటిపూటకే పరిమితమవుతాయి.

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2వ తేదీ నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. నవంబర్‌ 23వ తేదీ నుంచి 6, 7, 8 క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు.

డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులకు క్లాసులు ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.

Also read:  చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త

Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్

Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu