ధరణీ పోర్టల్ సీక్రెట్ వెల్లడించిన కేసీఆర్

ధరణీ పోర్టల్‌పై తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దాని సీక్రెట్లను స్వయంగా వెల్లడించారు. ధరణీ పోర్టల్ పనితీరు అద్భుతంగా వుందంటున్న కేసీఆర్.. సాంకేతిక సమస్యలు ఎదురైతే ఎలా అధిగమిస్తామన్న అంశంపై కీలక విషయాలను తెలిపారు.

ధరణీ పోర్టల్ సీక్రెట్ వెల్లడించిన కేసీఆర్
Rajesh Sharma

|

Oct 29, 2020 | 5:23 PM

KCR discloses dharani portal secret:  ధరణీ పోర్టల్ రూపకల్పనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు.. ప్రతీ చిన్న అంశాన్ని కూడా అత్యంత శ్రద్ధతో రూపొందించేలా ఆదేశాలిచ్చారు. టెక్నికల్ సమస్యలున్నాయంటూ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తుంటే.. వాటిని కొట్టి పారేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ధరణీ పోర్టల్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదంటున్నారు.

ధరణీ పోర్టల్‌ను ప్రారంభించిన అనంతరం సుదీర్ఘ ప్రసంగంలో చాలా వివరాలను వెల్లడించిన కేసీఆర్.. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ మరికొన్ని కీలకాంశాలను వెల్లడించారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహశీల్దార్ ఆఫీసుల్లో ప్రారంభిస్తున్నామని, పదిహేను రోజుల్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

ప్రతీ ఓపెన్ ప్లాట్ ఓనర్ విధిగా వ్యవసాయేతర భూమి ఆస్తిగా నమోదు చేసుకోవాల్సి వుంటుందని సీఎం చెప్పారు. తమ ప్లాట్ల వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించవద్దు అనుకుంటే ‘హైడ్’ ఆప్షన్ ఎంపిక చేసుకునే వెలుసుబాటు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. పూర్తి టైటిల్ విషయంలో ఓనర్ నష్టపోతే ప్రభుత్వమే నష్ట పరిహారం ఇస్తుందని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన అంశాన్ని మీడియా ప్రతినిధులతో షేర్ చేసుకున్నారు ముఖ్యమంత్రి. ధరణీ పోర్టల్‌కు ఏదైనా టెక్నికల్ సమస్యలు వస్తే.. బ్యాక్ అప్‌ ద్వారా సమస్యలను పరిష్కరించుకునే ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ బ్యాక్ అప్ వ్యవస్థను తెలంగాణలో కాకుండా వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేశామన్నారు. వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేసే సర్వర్ల సాయంతో సాంకేతిక సమస్యలను అధిగమిస్తామన్నారు.

Also read:  చెరుకు రైతులకు మోదీ కేబినెట్ శుభవార్త

Also read: నవంబర్ 2 నుంచి ఏపీ స్కూళ్ళు రీఓపెన్… కండీషన్స్ ఇవే

Also read: ఏపీ సీఎంకు ఉండవల్లి ఉచిత సలహా

Also read: అతి చేయొద్దు సూర్యా.. రవిశాస్త్రి వార్నింగ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu