ఈ-వాహనాలపై తెలంగాణ సర్కార్ మరో ముందడుగు..

ఎల‌క్ర్టిక్ వాహ‌నాల పాల‌సీని రాష్ర్ట ప్ర‌భుత్వం ఓకే చేసింది. 2020-2030 కాలానికి ఎల‌క్ర్టిక్ వాహ‌నాల‌కు విధాన ప్ర‌క‌ట‌న తెలంగాణ సర్కార్ జారీ చేసింది. ఈ మేర‌కు కొత్త విధానంపై ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ శాఖ ఉత్త‌ర్వులు ఇచ్చింది. రాష్ర్టాన్ని ఎల‌క్ర్టానిక్ వాహ‌నాలు,..

ఈ-వాహనాలపై తెలంగాణ సర్కార్ మరో ముందడుగు..
Follow us

|

Updated on: Oct 29, 2020 | 5:29 PM

Electric Vehicle Policy : ఎల‌క్ర్టిక్ వాహ‌నాల పాల‌సీని రాష్ర్ట ప్ర‌భుత్వం ఓకే చేసింది. 2020-2030 కాలానికి ఎల‌క్ర్టిక్ వాహ‌నాల‌కు విధాన ప్ర‌క‌ట‌న తెలంగాణ సర్కార్ జారీ చేసింది. ఈ మేర‌కు కొత్త విధానంపై ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ శాఖ ఉత్త‌ర్వులు ఇచ్చింది. రాష్ర్టాన్ని ఎల‌క్ర్టానిక్ వాహ‌నాలు, ఎన‌ర్జీ స్టోరేజ్ హ‌బ్‌గా మార్చే ప్ర‌ణాళిక‌లో భాగంగా ఈ విధానాన్ని తెలంగాణ సర్కార్ ముందుకు తీసుకొస్తోంది. ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ వినియోగానికి ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాలు కూడా ప్రకటించనుంది. రాష్ర్టంలోనే కొనుగోలు చేసి, రిజిస్ర్టేష‌న్ చేయించుకుంటే ప‌లు రాయితీలను ఇవ్వనుంది.

తొలి 2 ల‌క్ష‌ల ఎల‌క్ర్టిక్ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు, మొద‌టి 20 వేల మూడుచ‌క్రాల ఆటోల‌కు, మొద‌టి 5వేల నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు, మొద‌టి 10 వేల లైట్ గూడ్స్ వాహ‌నాల‌కు, మొద‌టి 5 వేల ఎల‌క్ర్టిక్ కార్ల‌కు, తొలి 500 ఎల‌క్ర్టిక్ బ‌స్సుల‌కు  ర‌హ‌దారి ప‌న్ను, రిజిస్ర్టేష‌న్ రుసుం మిన‌హాయింపు ఇవ్వ‌నుంది.

ఎల‌క్ర్టిక్ ట్రాక్ట‌ర్ల‌కు ర‌హ‌దారి ప‌న్ను, రిజిస్ర్టేష‌న్ రుసుం పూర్తిగా మిన‌హాయింపు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లోనూ ఎల‌క్ర్టిక్ వాహ‌నాల వినియోగానికి ప్ర‌భుత్వం ప్రోత్సాహం క‌ల్పిస్తుంది. ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల‌కు ఛార్జింగ్ స‌దుపాయాల కోసం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం తీసుకుంటుంది.