అల్లావుద్దీన్‌ దీపమంటూ డాక్టర్‌ను మోసం చేసిన లేడి

మోసపోవడానికి చదువుకు సంబంధం లేదు.. ఒక్కోసారి ఉన్నత చదువులు చదివిన వారు కూడా చాలా సిల్లీగా ఇట్టే మోసపోతుంటారు..! ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో లాయిక్‌ ఖాన్‌ అనే డాక్టరున్నాడు..

  • Balu
  • Publish Date - 5:24 pm, Thu, 29 October 20
అల్లావుద్దీన్‌ దీపమంటూ డాక్టర్‌ను మోసం చేసిన లేడి

మోసపోవడానికి చదువుకు సంబంధం లేదు.. ఒక్కోసారి ఉన్నత చదువులు చదివిన వారు కూడా చాలా సిల్లీగా ఇట్టే మోసపోతుంటారు..! ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో లాయిక్‌ ఖాన్‌ అనే డాక్టరున్నాడు.. బ్రహ్మపురి ప్రాంతంలో ప్రాక్టీసు చేసుకుంటుంటాడు.. అన్నట్టు ఈయన కొద్దికాలం కిందటే లండన్‌ నుంచి ఇక్కడికి వచ్చాడు.. మాంచి తెలివితేటలున్నాయనే కదా అర్థం! ఇలాంటి ఆయనను ఓ మాయలేడి బుట్టలో వేసింది.. తన దగ్గర అల్లావుద్దీన్‌ దీపం ఉందని, దాన్ని ఒక్కసారి రుద్దితే చాలు భూతం వచ్చి చెప్పిన పనల్లా బుద్ధిగా చేసి వెళుతుందని చెప్పింది.. ఆ ఆరేబియన్‌ నైట్స్‌ కథకు ఖాన్‌గారు పడిపోయారు. అది తాతల కాలం నాటి కథ అని తెలిసీ ఆ దీపాన్ని రెండున్నర కోట్లకు కొనేసుకున్నాడు.. తర్వాత మోసపోయానని తెలిసి లబోదిబోమన్నాడు.. డాక్టర్‌గారు ఆమెను అంత గుడ్డిగా ఎలా నమ్మాడనుకుంటున్నారు? అదో పెద్ద కథ! సమీనా అనే ఆ మోసగత్తె అనారోగ్య సమస్యలపై తరచూ డాక్టర్‌ దగ్గరకు వస్తుండేది.. ముచ్చట్లు చెప్పేది.. డాక్టర్‌ కూడా ఓపిగ్గా ఆమె చెప్పినవన్ని వింటుండేవారు.. ఓ ఫైన్‌ డే .. . తానో మాంత్రికుడిని కలిశానని, అతడి దగ్గర మహాద్భుతమైన దీపం ఉందని, అచ్చంగా అల్లావుద్దీన్‌ దీపంలాంటిదని చెప్పుకొచ్చింది.. ఆమె చెప్పింది విన్న డాక్టర్‌ ఫ్లాటయ్యారు.. వెంటనే దాన్ని రెండున్నర కోట్లు పెట్టి కొనుక్కున్నాడు.. ఆ దీపాన్ని కొన్ని రోజుల పాటు తాకొద్దని, తాకితే దాని శక్తులు పోతాయని సమీనా ప్లస్‌ మాంత్రికుడు చెప్పిన మాటలను బుద్దిగా పాటించిన డాక్టర్‌ కొన్ని రోజుల తర్వాత రుద్దడం మొదలుపెట్టాడు.. ఎన్ని సార్లు రుద్దినా భూతం రాలేదు.. అప్పుడు మోసపోయినట్టు తెలుసుకున్నాడు.. వెంటనే పోలీసుస్టేషన్‌కు పరుగులు పెట్టాడు.. పోలీసులు ఇస్లాముద్దీన్‌ అనే ఆ మాంత్రికుడి వేషధారిని పట్టుకున్నారు కానీ ఆ కిలాడీ లేడి మాత్రం ఇంకా పోలీసుల కళ్లబడలేదు..