బ్రేకింగ్.. భక్తులకు షాక్.. పూరి జగన్నాథ రథయాత్రపై సుప్రీం స్టే..
ప్రతిఏటా అంగరంగ వైభవంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రపై ఈ సారి నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రథయాత్రపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
ప్రతిఏటా అంగరంగ వైభవంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రపై ఈ సారి నీలిమేఘాలు కమ్ముకున్నాయి. రథయాత్రపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ నెల 23వ తేదీన జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన రథయాత్ర పనులు గత నెలలోనే కేంద్రం అనుమతులతో ప్రారంభమయ్యాయి. అయతే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు పూరీ జగన్నాథ రథయాత్రపై స్టే విధించింది. రథయాత్రను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజారోగ్యం, పౌరుల భధ్రత కోరకు.. ఈ ఏడాది రథయాత్రను అనుమతించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహణ సబబు కాదని అభిప్రాయపడింది.
కాగా, ఇప్పటికే గత పౌర్ణమి రోజు జగన్నాథుడికి పౌర్ణమి స్నాన కార్యక్రమాలు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ చేసిన సంగతి తెలిసిందే.
Supreme Court stays the annual Rath Yatra at Puri’s Jagannath Temple in Odisha on June 23 pic.twitter.com/lEoWjBYipn
— ANI (@ANI) June 18, 2020