ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ శుభవార్త.. జనవరి నుంచే !

ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు. ఇదివరకే ఇనిషియేట్ చేసిన ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియలో కీలక ఘట్టం జనవరి 1 నుంచి మొదలవుతుందని ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా తుది అంకానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రక్రియకు ఇదివరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. ప్రక్రియ కూడా […]

ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ శుభవార్త.. జనవరి నుంచే !
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 16, 2019 | 6:17 PM

ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు. ఇదివరకే ఇనిషియేట్ చేసిన ఏపీఎస్ఆర్టీసీ విలీన ప్రక్రియలో కీలక ఘట్టం జనవరి 1 నుంచి మొదలవుతుందని ప్రకటించారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా తుది అంకానికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రక్రియకు ఇదివరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. ప్రక్రియ కూడా వేగంగా పూర్తి అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు శుభవార్త చెప్పారు. సోమవారం శాసనసభలో ఆర్టీసీ విలీనంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. విలీనం బిల్లును రవాణా శాఖా మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టాగా దాన్ని చారిత్రాత్మక బిల్లుగా జగన్ అభివర్ణించారు.

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న 52 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని, వారంతా జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులేనని ప్రకటించారు సీఎం. ఆర్టీసీ ఛార్జీలపై రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు జగన్. విలీనం బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకునేందుకు ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి ఆరోపించారు.