AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: ఎన్‌కౌంటర్‌పై విచారణ షురూ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్యకేసులో నేరస్థుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి విచారణ ప్రారంభమైంది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సూ-మోటోగా స్పందించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం నియమించిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ జడ్జి విఎస్ సిర్పూర్కర్, రేఖా బల్డొటా, కార్తికేయన్‌లతో కూడిన సుప్రీం త్రిసభ్య కమిటీ సోమవారం తమ విధులకు శ్రీకారం చుట్టింది. ముందుగా కేసు పూర్వాపరాలను పరిశీలించేందుకు మొత్తం కేసు డైరీని తెప్పించుకున్నారు త్రిసభ్య […]

బ్రేకింగ్: ఎన్‌కౌంటర్‌పై విచారణ షురూ
Rajesh Sharma
|

Updated on: Dec 16, 2019 | 4:56 PM

Share

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్యకేసులో నేరస్థుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి విచారణ ప్రారంభమైంది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సూ-మోటోగా స్పందించిన సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల కమిటీని ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం నియమించిన సంగతి తెలిసిందే.

రిటైర్డ్ జడ్జి విఎస్ సిర్పూర్కర్, రేఖా బల్డొటా, కార్తికేయన్‌లతో కూడిన సుప్రీం త్రిసభ్య కమిటీ సోమవారం తమ విధులకు శ్రీకారం చుట్టింది. ముందుగా కేసు పూర్వాపరాలను పరిశీలించేందుకు మొత్తం కేసు డైరీని తెప్పించుకున్నారు త్రిసభ్య కమిటీ సభ్యులు. దిశ కేసు వివరాలు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల వివరాలను త్రిసభ్య కమిటీ పరిశీలించింది. ఎన్.హెచ్.ఆర్.సీ. బృందం సేకరించిన వివరాలను తమకు ఇవ్వాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌ను త్రిసభ్య కమిటీ కోరినట్లు సమాచారం.

కాగా.. త్రిసభ్య కమిటీ మరో మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి రాక ఖరారు కావడంతో త్రిసభ్య కమిటీకి అవసరమైన వివరాలు ఇచ్చేందుకు, వారికి సంబంధించిన అన్ని పనులు చూసుకునేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఓ అధికారుల బృందాన్ని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోపస్‌ జీవి గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యపోయే నిజాలు!
అక్టోపస్‌ జీవి గురించి మీకు తెలుసా..? ఆశ్చర్యపోయే నిజాలు!
అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ
అనగనగా ఒక రాజు ట్విట్టర్ రివ్యూ
ఇంటర్‌ అర్హతతో.. ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు 2027 ఉద్యోగాలు
ఇంటర్‌ అర్హతతో.. ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు 2027 ఉద్యోగాలు
: తెలంగాణలో మున్సిపల్ హీట్.. పట్టణాలపై పార్టీల స్పెషల్ ఫోకస్..
: తెలంగాణలో మున్సిపల్ హీట్.. పట్టణాలపై పార్టీల స్పెషల్ ఫోకస్..
అమెరికా టీమ్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్
అమెరికా టీమ్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్
1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ
1736 రోజుల నిరీక్షణకు తెర..మళ్ళీ నంబర్-1 సింహాసనంపై విరాట్ కోహ్లీ
మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!