వేదిక ఖరారు.. జగన్ ప్రమాణస్వీకారానికి మొదలైన ఏర్పాట్లు

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వేదికను ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో, మరో 20వేల మంది దిగువున కూర్చునే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. […]

వేదిక ఖరారు.. జగన్ ప్రమాణస్వీకారానికి మొదలైన ఏర్పాట్లు
Follow us

| Edited By:

Updated on: May 25, 2019 | 3:46 PM

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వేదికను ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్టేడియంలో 35వేల మంది గ్యాలరీల్లో, మరో 20వేల మంది దిగువున కూర్చునే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అయితే చినఅవుటపల్లి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఓ ప్రాంతంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని మొదట అధికారులు భావించినప్పటికీ.. జగన్ మాత్రం విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎస్.. అందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నరసింహన్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది.