భారత్‌లో కొత్త రోజులు మొదలయ్యాయి: సాధ్వీ ప్రఙ్ఞాపై నటి సెటైరికల్ కామెంట్లు

భారత్‌లో కొత్త రోజులు మొదలయ్యాయంటూ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రఙ్ఞాపై సెటైరికల్ కామెంట్లు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన స్వరా భాస్కర్.. భారత్‌లో కొత్త రోజులు మొదలయ్యాయి. ఒక ఉగ్రవాద ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్లమెంట్‌కు పంపుతున్నాం. ఇప్పుడు పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకోవాలి అంటూ కామెంట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు కూడా ఘాటుగా స్పందించారు. ‘‘నువ్వు మద్దతిస్తూ పర్యటన చేసిన ఏ అభ్యర్థి గెలవలేదంటూ’’ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా […]

భారత్‌లో కొత్త రోజులు మొదలయ్యాయి: సాధ్వీ ప్రఙ్ఞాపై నటి సెటైరికల్ కామెంట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2019 | 5:50 PM

భారత్‌లో కొత్త రోజులు మొదలయ్యాయంటూ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రఙ్ఞాపై సెటైరికల్ కామెంట్లు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసిన స్వరా భాస్కర్.. భారత్‌లో కొత్త రోజులు మొదలయ్యాయి. ఒక ఉగ్రవాద ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్లమెంట్‌కు పంపుతున్నాం. ఇప్పుడు పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకోవాలి అంటూ కామెంట్ చేశారు. అయితే దీనిపై నెటిజన్లు కూడా ఘాటుగా స్పందించారు. ‘‘నువ్వు మద్దతిస్తూ పర్యటన చేసిన ఏ అభ్యర్థి గెలవలేదంటూ’’ ఆమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్వరా భాస్కర్ వివాదాల్లో నిలవడం ఇది తొలిసారేం కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె.. అనవసర విషయాలపై స్పందిస్తూ నెటిజన్ల చేత విమర్శల పాలవుతూ ఉంటుంది.