AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ ఛాన్స్.. 5 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్పు.. ఎలా అంటే..?

రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ట్రైన్ బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందే బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు త్వరలోనే మార్పులు చేయనుందని తెలుస్తోంది. దీనిపై చర్చలు జరుగుతుండగా.. త్వరలోనే రైల్వే బోర్డు ఆమోదించనుంది.

Indian Railway: ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ ఛాన్స్.. 5 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్పు.. ఎలా అంటే..?
Railway
Venkatrao Lella
|

Updated on: Feb 22, 2026 | 3:24 PM

Share

రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త. ఇక నుంచి రెండో రిజర్వేషన్ ఛార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు ప్రయాణికులు తమ బోర్డింగ్ పాయింట్ మార్పుకోవచ్చు. ఈ మేరకు త్వరలోనే రైల్వేశాఖ సిస్టమ్‌లో మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం రైలు బయలుదేరడానికి 10 నుంచి 20 గంటలకు ముందు తొలి చార్ట్ ప్రిపర్ అయిన తర్వాత బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి అనుమతి లేదు. తొలి రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అవ్వడానికి ముందు ప్రయాణికులు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే అవకాశముంది. అయితే రిజర్వేషన్ టికెట్లకు బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవడానికి మరింత గడువు పొడిగించే అంశాన్ని రైల్వేశాఖ వర్గాలు ప్రస్తుతం పరిశీలిస్తున్నాయి.

ప్రయాణికులకు పెద్ద ఊరట

ప్రయాణికులకు పెద్ద ఊరట కలిగించే న్యూస్ రైల్వేశాఖ తెలిపింది. ఇక నుంచి రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయ్యే వరకు బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే అవకాశం కల్పించనుంది. త్వరలోనే దీనిని రైల్వేశాఖ అమలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేయబడిన రైలు బయలుదేరడానికి 10 నుంచి 20 గంటల ముందు మొదటి ఛార్ట్ రూపొందిస్తున్నారు. దీని తర్వాత బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే అవకాశం లేదు. ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ గుడుపును పొడిగించాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఇక నుంచి రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అవ్వడానికి ముందు వరకు మార్చుకునేందుకు అవకాశం కల్పించనుంది. అంటే రైలు బయలుదేరే 30 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను సవరించుకోవచ్చన్నమాట. కొత్త ప్రతిపాదనతో ముందుకు సాగడానికి సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)ను రైల్వేశాఖ ఆదేశించింది. CRIS నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబడుతుంది. ఆమోదం పొందితే చివరి నిమిషంలో ప్రయాణంలో మార్పులు చేసుకునే ప్రయాణీకులకు ఈ చర్య గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇది అనవసరమైన రద్దులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

ప్రయోజనాలు ఏంటంటే..?

-చివరి నిమిషంలో ప్లాన్‌లో మార్పులు జరిగినప్పుడు ప్రయాణికకులకు సౌలభ్యంగా ఉంటుంది -టికెట్లను రద్దు చేసుకోవాల్సిన అవసరం తగ్గుతుంది -మరింత ప్రయాణ సౌలభ్యం లభిస్తుంది -ప్రస్తుతం ఈ నిర్ణయం సమీక్ష దశలో ఉండగా.. సాధ్యసాధ్యాలను పరిశీలించాల్సిందిగా సీఆర్‌ఐఎస్‌కి సూచించింది -సీఆర్‌ఐఎస్ నుంచి నివేదిక వచ్చిన అనంతరం రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది -అనంతరం కొత్త వ్యవస్థ అమల్లోకి రానుంది

Follow Us
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!
రాహువు ఎఫెక్ట్.. ఈ రాశులకు ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ..!