కడుపునొప్పి అంటే స్కాన్.. రిపోర్ట్స్ చూసి షాక్‌ తిన్న డాక్టర్లు

కడుపునొప్పి రావడంతో ఓ వ్యక్తి వైద్యులను సంప్రదించాడు. అయితే వారు పరీక్షలు నిర్వహించి.. వచ్చిన రిపోర్ట్స్ చూసి షాక్‌కు గురయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీలాల్ బహదూర్ శాస్త్రి అనే వ్యక్తి కడుపులో నొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. 35 ఏళ్ల వయసున్న అతనికి వైద్యులు స్కానింగ్ నిర్వహించారు. అయితే పరీక్షల్లో సదరు వ్యక్తి కడుపులో 8 స్పూన్లు, 2 స్క్రూడ్రైవర్లు, 2 టూత్ బ్రష్‌లు, ఒక కత్తి ఉన్నట్లు గుర్తించారు. అవి చూసి షాక్‌కు గురైన […]

కడుపునొప్పి అంటే స్కాన్.. రిపోర్ట్స్ చూసి షాక్‌ తిన్న డాక్టర్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2019 | 5:25 PM

కడుపునొప్పి రావడంతో ఓ వ్యక్తి వైద్యులను సంప్రదించాడు. అయితే వారు పరీక్షలు నిర్వహించి.. వచ్చిన రిపోర్ట్స్ చూసి షాక్‌కు గురయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీలాల్ బహదూర్ శాస్త్రి అనే వ్యక్తి కడుపులో నొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. 35 ఏళ్ల వయసున్న అతనికి వైద్యులు స్కానింగ్ నిర్వహించారు. అయితే పరీక్షల్లో సదరు వ్యక్తి కడుపులో 8 స్పూన్లు, 2 స్క్రూడ్రైవర్లు, 2 టూత్ బ్రష్‌లు, ఒక కత్తి ఉన్నట్లు గుర్తించారు. అవి చూసి షాక్‌కు గురైన వైద్యులు.. తక్షణమై అతనికి శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కడుపులో ఉన్న స్పూన్లు, స్క్రూడ్రైవర్లు, టూత్ బ్రష్‌లు, కత్తిని బయటకు తీశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. మానసిక స్థితి సరిగాలేని వారిలో కొందరు మాత్రమే లోహాలను తింటుంటారని డాక్టర్లు పేర్కొన్నారు.