మోదీ ఒక గొప్ప వ్యక్తి: డొనాల్డ్‌ ట్రంప్

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు తెలియగానే ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌.. శుక్రవారం మోదీకి స్వయంగా ఫోన్‌ చేశారు. ‘ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశాను. ఆయనో గొప్ప వ్యక్తి. భారత ప్రజలకు ఓ మంచి నాయకుడు. మోదీ ఉండటం వారి అదృష్టం’ అని ట్రంప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్‌, మోదీ జూన్‌లో […]

మోదీ ఒక గొప్ప వ్యక్తి: డొనాల్డ్‌ ట్రంప్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 25, 2019 | 4:51 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు తెలియగానే ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్‌.. శుక్రవారం మోదీకి స్వయంగా ఫోన్‌ చేశారు. ‘ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశాను. ఆయనో గొప్ప వ్యక్తి. భారత ప్రజలకు ఓ మంచి నాయకుడు. మోదీ ఉండటం వారి అదృష్టం’ అని ట్రంప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు ట్రంప్‌, మోదీ జూన్‌లో సమావేశం కానున్నట్లు నిన్న శ్వేతసౌధం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. వచ్చే నెలలో జపాన్‌లో జరగనున్న జి-20 దేశాల సదస్సులో భాగంగా వీరి భేటీ జరగనుంది. ట్రంప్‌.. మోదీకి ఫోన్‌ చేసినప్పుడు ఈ సమావేశంపై వీరిద్దరూ ఓ అంగీకారానికి వచ్చినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. జూన్‌ 28-29న జి-20 దేశాల సదస్సు జరగనుంది.