సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త ట్రెండ్..!

సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త ట్రెండ్..!

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినిమా ట్రెండ్ మారింది. మూస కాన్సెప్ట్స్ ను వదిలేసి డైరెక్టర్స్ సరికొత్త కథలతో మన ముందుకు వస్తున్నారు. బయోపిక్స్, పిరియాడికల్ కాన్సెప్ట్స్ పై ఎక్కువ దృష్టి సారించారు. ఇప్పుడు లేటెస్ట్ గా వాటితో పాటు దేశభక్తి కాన్సెప్ట్ కూడా చేరింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరి డైరెక్టర్స్ ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ పై కన్నేశారు. అయితే ఈ కాన్సెప్ట్ ప్రతీసారి హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం. ఉరి సినిమా […]

Ravi Kiran

|

Feb 25, 2019 | 6:00 PM

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో సినిమా ట్రెండ్ మారింది. మూస కాన్సెప్ట్స్ ను వదిలేసి డైరెక్టర్స్ సరికొత్త కథలతో మన ముందుకు వస్తున్నారు. బయోపిక్స్, పిరియాడికల్ కాన్సెప్ట్స్ పై ఎక్కువ దృష్టి సారించారు. ఇప్పుడు లేటెస్ట్ గా వాటితో పాటు దేశభక్తి కాన్సెప్ట్ కూడా చేరింది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరి డైరెక్టర్స్ ఇప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ పై కన్నేశారు. అయితే ఈ కాన్సెప్ట్ ప్రతీసారి హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం.

ఉరి సినిమా సక్సెస్ తో ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా దేశభక్తి సినిమాలపై దృష్టి సారించారు. సీనియర్స్ నుంచి యువ హీరోస్ వరకు అందరూ కూడా దేశభక్తి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అటు టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు కనిపించినా.. బాలీవుడ్ లో మాత్రం క్యూ కడుతున్నాయి. అలా వస్తున్న సినిమానే ‘కేసరి’. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం సిక్కుల యుద్ధ వీరుల ప్రధానాంశంతో రూపొందింది. సల్మాన్ ఖాన్ ‘భరత్’ సినిమా కూడా దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. అమీర్, షారుఖ్ లు కూడా దేశభక్తి స్క్రిప్ట్స్ కోసం వెతుకుతున్నట్లు వినికిడి. ఇక టాలీవుడ్ లో చిరంజీవి హీరోగా రూపొందే ‘సైరా నరసింహారెడ్డి’ కూడా దేశభక్తి సినిమానే. చరిత్ర చెప్పని కథను చెప్పబోతున్నాడు చిరంజీవి. తొలి స్వాతంత్ర యోధుడి కథతో ఈ చిత్రం రూపొందుతోంది. కొన్ని సార్లు ఈ ఫార్ములా నిరాశ పరిచినా.. కొన్ని సార్లు మాత్రం మంచి విజయాలు అందించింది.

సుల్తాన్, జయహో, రంగ్ డే బసంతి, మై నేమ్ ఈజ్ ఖాన్, స్టాలిన్, నా పేరు సూర్య, ఘాజీ, అంతరిక్షం, కంచె ఇలా చాలా సినిమాలు అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో ఇదివరకే వచ్చిన దేశభక్తి చిత్రాలు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu