సహచర మంత్రులపై చంద్రబాబు ఫైర్

అమరావతి: రాజకీయ పరిణామాలపై ప్రతి స్పందించే విషయంలో మంత్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. దీటుగా స్పందించకుంటే ప్రతిపక్ష పార్టీల వాదనే ప్రజల్లోకి వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయాలపై మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో ముందస్తుగానే కూటమి ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్నిఈ భేటీలో సీఎం ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగానే కూటమి […]

సహచర మంత్రులపై చంద్రబాబు ఫైర్
Follow us

|

Updated on: Feb 25, 2019 | 6:02 PM

అమరావతి: రాజకీయ పరిణామాలపై ప్రతి స్పందించే విషయంలో మంత్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. దీటుగా స్పందించకుంటే ప్రతిపక్ష పార్టీల వాదనే ప్రజల్లోకి వెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయాలపై మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో ముందస్తుగానే కూటమి ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్నిఈ భేటీలో సీఎం ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందస్తుగానే కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంచేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండదనే విషయాన్ని మరోసారి చంద్రబాబు తేల్చి చెప్పారు.