జాగ్రత్త : ఆయా పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ వార్నింగ్
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండని సూచించింది. ఇలాంటి సమయాల్లో సురక్షితమైన భవనాల్లో..
Lightning strikes warning : ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీచేసింది. విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని పేర్కొంది. పాడేరు, చీడికాడ, దేవరపల్లి, హుకుంపేట, అనంతగిరి, వేపాడ, లక్కవరపుకోట మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని వెల్లడించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండని సూచించింది. ఇలాంటి సమయాల్లో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలని ప్రజలకు విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు కోరారు.
సాధారణంగా వర్షం పడ్డటప్పుడు ఎక్కువ మంది చెట్ల కిందకు వెళతారు. మనుషులకు రక్షణ పిడుగు రక్షకాలున్న భవనాలే కానీ చెట్లు ఎంత మాత్ర కావు. పిడుగులు పడే సమయంలో ఆరు బయటకు వెళ్లవద్దు. చెట్ల కింద ఉండడం క్షేమం కాదు. చెట్లు పిడుగుని ఆకర్షిస్తాయి. తప్పని సరై ఉండాల్సి వస్తే కాళ్లు ముడుచుకుని కూర్చోవాలి. ఇంట్లో గోడలకు ఆనుకుని ఉండడం మంచిది కాదు. మనిషి, నాలుగు కాళ్ళ జంతువైన ఆవులాంటి జంతువు పక్క పక్కనే ఉంటే నాలుగు కాళ్ళ జంతువుకు ఎక్కువ ప్రమాదం.
వజ్రపథ్ ద్వారా పిడుగుల గురించి ముందస్తు సమాచారం తెలుసుకోవచ్చు. వాటికి లైట్‌నింగ్ అరెస్టర్లతో చెక్ పెట్టవచ్చు. పిడుకుపాటు నుంచి రక్షణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి వుంటుంది. ఎత్తయిన నిర్మాణాలు, పెద్దపెద్ద కట్టడాలు పిడుగుబారిన పడకుండా లైట్‌నింగ్ అరెస్టర్‌లు ఏర్పాటు విద్యుత్ ఉపకేంద్రాల వద్ద, ఎత్తయిన ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద ఏర్పాటు చేసుకోవాలి. పిడుగు పడే సమయంలో పిడుగును ఆకర్షించకుండా దాని దిశను మార్చేందుకు లైటినింగ్ అరెస్టర్లు ఉపయోగపడతాయి.
Read also : సిరిసిల్లలో బిజీ.. బిజీగా గడిపిన సీఎం.. ఓ వైపు చలోక్తులు, మరో వైపు అభివృద్ధి మాటలు, మరోచోట తీవ్ర అసహనం.!