Breaking: కరోనా నేపథ్యంలో కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణలో శరవేగంగా పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓకేరోజు ఎనిమిది మందికి పాజిటివ్ రావడం.. ఆ తర్వాత కూడా ప్రతీరోజు రెండు, మూడు చొప్పున కరోనా పాజిటివ్ తేలుతుండడంతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగనున్నారు.

Breaking: కరోనా నేపథ్యంలో కేసీఆర్ సంచలన నిర్ణయం
Follow us
Rajesh Sharma

|

Updated on: Mar 20, 2020 | 3:21 PM

Telangana CM KCR has taken sensational decision on #Covid19: తెలంగాణలో శరవేగంగా పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓకేరోజు ఎనిమిది మందికి పాజిటివ్ రావడం.. ఆ తర్వాత కూడా ప్రతీరోజు రెండు, మూడు చొప్పున కరోనా పాజిటివ్ తేలుతుండడంతో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. కానీ 24 గంటలు తిరక్కముందే ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌తోపాటు.. అధికార బృందంతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించాలని నిర్ణయించారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టారు. అయితే ఇండోనేషియా నుంచి వచ్చిన వారి సంఖ్య 30 దాకా వుందని తేలడంతో కరీంనగర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పలు సూచనలు చేస్తూ వచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారికి తప్ప, స్థానికులెవరికీ వ్యాధి సోకకుండా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. కరీంనగర్‌లో పరిస్థితిని స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించేందుకు శుక్రవారమే ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌కు వెళ్ళాలని భావించారు. కానీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్సు వుండడంతో శనివారానికి వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. సీఎంతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్ లో పర్యటిస్తారు. అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తారని సమాచారం.