Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BS Yediyurappa: ఫలించిన హైకమాండ్ బుజ్జగింపులు.. కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధం..?

BS Yediyurappa resign?: కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామాకు రంగం సిద్ధమైనట్లు

BS Yediyurappa: ఫలించిన హైకమాండ్ బుజ్జగింపులు.. కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధం..?
Bs Yediyurappa Meets Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 17, 2021 | 12:31 PM

BS Yediyurappa resign?: కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామాకు రంగం సిద్ధమైనట్లు విశ్వనీయవర్గాల సమాచారం. 79 ఏళ్ల యడియూరప్ప ఆరోగ్య కారణాల వల్ల రాజీనామాకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు పార్టీ పెద్దల బుజ్జగింపు ప్రయత్నాలు సఫలమైనట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కర్ణాటక సీఎం పదవి నుంచి వైదొలగి కొత్త సీఎంకు పగ్గాలు అప్పగించేందుకు యడియూరప్ప సముఖత సముఖత వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. కాగా..గత కొన్ని రోజుల నుంచి కర్ణాటక ప్రభుత్వంలో అసమ్మతి గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల మేరకు సీఎం యడియూరప్పకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. అనంతరం ఈ రోజు యడియరప్ప బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపైనే వారి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సీఎం పదవికి రాజీనామా చేసేందుకు యడియూరప్ప అంగీకరించినట్లు వినికిడి.

కాగా ఆయన రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి సదానంద గౌడకు ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. సదానందకు ఇస్తారా..? లేక మరెవరికైనా కొత్త సీఎం బాధ్యతలను అప్పగిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో కొన్ని రోజుల నుంచి అసమ్మతి గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. యడియూరప్పకు వ్యతిరేకంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడంతో పార్టీ ఈ విషయాన్ని సీరియస్‌‌గా తీసుకుంది. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌ సింగ్‌ పర్యటించి ఎమ్మెల్యేలతో మాట్లాడి అనంతరం అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. ఆయనను మార్చాలంటూ కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా డిమాండ్‌ చేశారు. పార్టీలో యడియూరప్ప తనయుడి జోక్యం కూడా ఎక్కువైందంటూ పలువురు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో యడియూరప్ప కేబినెట్‌లో యడియూరప్ప అనుచరులకే పెద్దపీట వేసినట్లు ఫిర్యాదులు అందాయి.

Also Read:

UP Elections 2022: సమాజ్‌వాది పార్టీ సభలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు.. ఐదుగురు అరెస్ట్

Marriage: 20 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్న వృద్ధ జంట.. కుమారుడు, గ్రామస్థుల సమక్షంలో వేడుక..