Marriage: 20 ఏళ్ల సహజీవనం తర్వాత పెళ్లి చేసుకున్న వృద్ధ జంట.. కుమారుడు, గ్రామస్థుల సమక్షంలో వేడుక..
Elderly Couple Marriage: కొంతమంది ముందుగా ప్రేమించుకుని.. ఆ తర్వాత సహజీవనం చేసి.. వాళ్లకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటుంటారు. ఈ సంస్కృతి
Elderly Couple Marriage: కొంతమంది ముందుగా ప్రేమించుకుని.. ఆ తర్వాత సహజీవనం చేసి.. వాళ్లకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటుంటారు. ఈ సంస్కృతి ఒక్క విదేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఇవన్నీ సర్వసాధారణం. అయితే ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే మెల్లగా మన దేశంలోనూ పెరుగుతోంది. తాజాగా ఓ జంట రెండు దశాబ్దాల కింద నుంచి సహాజీవనం చేసి.. తాజాగా పెళ్లి పెళ్లి చేసుకుంది. షష్టిపూర్తి సమయంలో పెళ్లి చేసుకున్న ఈ జంటను చూసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఈ ఆశ్చర్యకర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఉన్నావ్ జిల్లాలోని రసూల్‌పుర్ రూరీ గ్రామానికి చెందిన నరైన్ రైదాస్ (60), రామ్‌రతి (55) రెండు దశాబ్దాల కింద ప్రేమించుకున్నారు. దాదాపు 2001 నుంచి అదే గ్రామంలో సహజీవనం చేస్తూ గడుపుతున్నారు. గ్రామంలో ప్రజలంతా వ్యతిరేకించినా వారు.. ఊరి పెద్దలను ఒప్పించి మరి కలిసి జీవిస్తున్నారు. వారికి ప్రస్తుతం 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే.. ఇంతకాలం గ్రామస్థులు ఎంత అవమానించినా సరే వారు వివాహం చేసుకోవాలని అనుకోలేదు. ఇటీవల గ్రామపెద్ద రమేశ్‌కుమార్, సామాజిక కార్యకర్త ధర్మేంద్ర బాజ్‌పేయీ కలిసి నరైన్, రామ్‌రతిని వివాహం చేసుకోవాలని కోరారు. వారు, వారి కుమారుడు ప్రజల నుంచి వస్తున్న అవమానాల నుంచి తప్పించుకోవాలంటే పెళ్లి చేసుకోక తప్పదని వారికి పలు సూచనలు చేశారు. చివరకు వివాహ వేడుకకు అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇవ్వడంతో.. ఆ జంట వివాహం చేసుకునేందుకు అంగీకరించింది.
చివరకు గ్రామ పెద్ద, గ్రామస్థులు కలిసి.. నరైన్ రైదాస్, రామ్‌రతి వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా విందును సైతం ఏర్పాటు చేశారు. అనంతరం బ్యాండ్‌ను సైతం ఏర్పాటు చేసి బరాత్ నిర్వహించారు. ఏదిఏమైనప్పటికీ.. ఇద్దరు.. కన్న కొడుకు సమక్షంలో ఇప్పటికైనా ఒక్కటయ్యారంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: