అలెర్ట్ : దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు
మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షాలు పడొచ్చని వివరించింది. బిహార్, పంజాబ్, బెంగాల్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాజస్థాన్లో పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, కేరళ పుదుచ్చేరి సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.
ఇక ఆగస్టులో దేశంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. సాధారణం కన్నా..27 శాతం అధిక వర్షపాతం ఆగస్టులో నమోదైనట్లు వివరించింది. ఆగస్టు నెలలో కురిసిన వర్షపాతం గత 120 ఏళ్లలో నాలుగో రికార్డు లెవల్ అని వెల్లడించింది.
Also Read :
ఏపీలో పింఛన్లు : నేటి నుంచే మళ్లీ బయోమెట్రిక్ అమల్లోకి