కరోనాపై కేంద్రం గుడ్ న్యూస్
దేశంలో కరోనా ప్రబలుతున్న వార్తలొకవైపు, గంటగంటకీ పెరుగుతున్న గణాంకాలపై మీడియాలో వార్తలొకవైపు దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది.

దేశంలో కరోనా ప్రబలుతున్న వార్తలొకవైపు, గంటగంటకీ పెరుగుతున్న గణాంకాలపై మీడియాలో వార్తలొకవైపు దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రాల వైద్య, ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర మంత్రి హర్షవర్దన్ కీలక కామెంట్లు చేశారు. చైనా కిట్లు నాసిరకంగా వున్నందున వాటికి డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
చైనా పంపిన నాసిరకం కరోనా టెస్ట్ కిట్లను వెనక్కి తిప్పి పంపిస్తామని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు హామీ ఇచ్చారు హర్షవర్దన్. చైనా కంపెనీలకు టెస్ట్ కిట్ల డబ్బులు చెల్లించలేదు.. ఇకపై చెల్లించేది లేదని ఆయనన్నారు. కేంద్ర బృందాలు రాష్ట్రాలకు సహకరించడం కోసమే కానీ.. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. లాక్‌డౌన్ చాలా రాష్ట్రాల్లో సరిగా అమలు చేయడం లేదని, యూపీ సీఎం లాక్‌డౌన్ విషయంలో కఠినంగా ఉన్నారని వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రి.
ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉంది.. కరోనా బారిన పడ్డ వారిలో రికవరీ రేటు మన దేశంలో బావుంది.. అని కామెంట్ చేసిన హర్షవర్దన్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు. అయితే, లాక్ డౌన్‌ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడమే దేశ ప్రజలందరి బాధ్యత అని ఆయన సూచించారు. రాష్ట్రాలు లాక్ డౌన్ అమలులో మరింత కఠినంగా వుండాలని తెలిపారాయన.




