AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రదీప్‌తో పెళ్లిపై జ్ఞానేశ్వరి షాకింగ్ కామెంట్స్

ప్రముఖ యాంకర్ ప్ర‌దీప్‌ ‘పెళ్లి చూపులు’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన జ్ఞానేశ్వరి త్వరలో ‘మిస్టర్ అండ్ మిస్’ సినిమాతో వెండితెరపై అరంగేట్ర౦ చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో జ్ఞానేశ్వరి ముద్దు సన్నివేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో జ్ఞానేశ్వరి ప్రదీప్‌ను పెళ్లి చేసుకోవడం డౌటేనంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చింది. ‘పెళ్లి చూపులు’ షోలో పాల్గోవాలనేది తన వ్యక్తిగత నిర్ణయమని జ్ఞానేశ్వరి తెలిపింది. ఈ షో కంటే […]

ప్రదీప్‌తో పెళ్లిపై జ్ఞానేశ్వరి షాకింగ్ కామెంట్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 5:00 PM

Share

ప్రముఖ యాంకర్ ప్ర‌దీప్‌ ‘పెళ్లి చూపులు’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన జ్ఞానేశ్వరి త్వరలో ‘మిస్టర్ అండ్ మిస్’ సినిమాతో వెండితెరపై అరంగేట్ర౦ చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో జ్ఞానేశ్వరి ముద్దు సన్నివేశంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో జ్ఞానేశ్వరి ప్రదీప్‌ను పెళ్లి చేసుకోవడం డౌటేనంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చింది.

‘పెళ్లి చూపులు’ షోలో పాల్గోవాలనేది తన వ్యక్తిగత నిర్ణయమని జ్ఞానేశ్వరి తెలిపింది. ఈ షో కంటే ముందే తాను షార్ట్‌ ఫిల్మ్‌ల్లో నటించానని, ఓ కన్నడ సినిమాలో కూడా నటించానని జ్ఞానేశ్వరి తెలిపింది. తన కెరీర్ కోసం ‘పెళ్లి చూపులు’ కార్యక్రమాన్ని ఎంచుకోలేదని, బుల్లితెరపై కనిపించాలనే ఆసక్తితోనే వెళ్లానంది. అంత మంచి షోలో నేను టైటిల్‌ను గెలుచుకోడాన్ని ఎప్పటికీ మరిచిపోలేను అని తెలిపింది.

‘పెళ్లి చూపులు’ కార్యక్రమాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘అది ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి తీసుకున్న నిర్ణయం. ప్రజలకు నచ్చితేనే ఏ కార్యక్రమమైనా కొనసాగుతుంది. ఆ కార్యక్రమాన్ని రిసీవ్ చేసుకోవడంలో ఎక్కడో మిస్ అండర్ స్టాండింగ్ జరిగి ఉంటుంది’’ అని తెలిపింది.

సినీ రంగంలో పైకి రావాలంటే కమిట్మెంట్ తప్పదనే ప్రచారంపై జ్ఞానేశ్వరి స్పందిస్తూ.. ‘‘నాకైతే అలాంటి ఇబ్బంది ఎప్పుడూ ఎదురుకాలేదు. నాతో పనిచేసేవారు కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. దీనిపై నాకు డౌట్ కూడా ఉంది. ఇప్పటివరకు నాతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు’’ అని తెలిపింది.

మరి, పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘‘ఆ కార్యక్రమంలో జరిగింది పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి చూపులకు, పెళ్లికి చాలా తేడా ఉంది. ఆ రెండిటికి మధ్య ఇంకా చాలా జర్నీ ఉంటుంది. వెయిట్ అండ్ సి. అప్పుడే నాకు పెళ్లేంటి? ఇంకా టైముంది కదా?’’ అంటూ ఇంటర్వ్యూ ముగించింది.

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!