నేడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తొలి జాబితా
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. వైఎస్సార్‌సీపీ ఎన్నికల […]
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు గాను తొలి విడతలో సగానికి పైగా అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది.
వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్ ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 13 జిల్లాల్లో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. మంగళవారం ఆయన పార్టీ సీనియర్ నేతలతో తన ఎన్నికల ప్రచార పర్యటనతో పాటుగా అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చలు జరిపారు. జగన్ ఎన్నికల ప్రచారయాత్రను పెనుగొండ, గాజువాక లేదా గురజాలలో ఏదో ఒక చోట నుంచి ప్రారంభించాలనే ప్రతిపాదనలు సమావేశంలో వచ్చినట్లు తెలిసింది. బుధవారం మళ్లీ జరిగే సమావేశంలో ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.