బెదిరింపు కాల్స్‌పై రాజ్‌నాథ్‌కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు

డిల్లీ: పలు ముస్లిం దేశాలు, విదేశాల నుంచి తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం ఆయన కలుసుకున్నారు. లండన్‌లో జనవరి 21న కాంగ్రెస్‌ నేత కపిల్‌సిబల్‌, సయ్యద్‌ సుజా అనే వ్యకి కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి 2014 ఎన్నికలకు ముందు తాను 11 మందిని హత్య చేయించానని, ఆ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు తోడ్పడ్డానని […]

బెదిరింపు కాల్స్‌పై రాజ్‌నాథ్‌కు కిషన్‌రెడ్డి ఫిర్యాదు
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2019 | 9:21 AM

డిల్లీ: పలు ముస్లిం దేశాలు, విదేశాల నుంచి తనకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, చంపుతామని బెదిరిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం ఆయన కలుసుకున్నారు. లండన్‌లో జనవరి 21న కాంగ్రెస్‌ నేత కపిల్‌సిబల్‌, సయ్యద్‌ సుజా అనే వ్యకి కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి 2014 ఎన్నికలకు ముందు తాను 11 మందిని హత్య చేయించానని, ఆ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు తోడ్పడ్డానని ఆరోపించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్లారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేయించాలని, కేసును సీబీఐకి అప్పజెప్పాలని ఆయన కోరారు. అనంతరం తెలంగాణ భవన్‌ ఆవరణలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసిన కపిల్‌సిబల్‌ నిరాధారమైన ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించినందున ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. తెలంగాణలో 16 సీట్లు గెలిపిస్తే దిల్లీలో చక్రం తిప్పుతామని తెరాస నేతలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం 15 మంది ఎంపీలు ఉంటే రాష్ట్రానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నరేంద్రమోదీ దేశానికి మళ్లీ ప్రధాని అవుతారని, దేశ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రజలు భాజపాకు ఓటు వేయాలని ఆయన కోరారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని.. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన తెలిపారు.