రాజమండ్రి, తిరుపతి ఎంపీ సీట్లకు టీడీపీ అభ్యర్థులు ఖరారు
సార్వత్రిక ఎన్నికల తేది దగ్గరపడుతున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమ బలబలగాలను చూపించుకోవాలనుకుంటోన్న ప్రధాన పార్టీలు ఆచితూచి అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజమండ్రి, తిరుపతి ఎంపీ సీట్లకు టీడీపీ తరఫున అభ్యర్థులను ఖరారు చేశారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళి మోహన్ తన అభిప్రాయాన్ని తెలపగా.. ఆ స్థానాన్ని ఆయన కోడలు మాగంటి రూపకు చంద్రబాబు […]
సార్వత్రిక ఎన్నికల తేది దగ్గరపడుతున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ ఎన్నికల్లో తమ బలబలగాలను చూపించుకోవాలనుకుంటోన్న ప్రధాన పార్టీలు ఆచితూచి అభ్యర్థులను ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాజమండ్రి, తిరుపతి ఎంపీ సీట్లకు టీడీపీ తరఫున అభ్యర్థులను ఖరారు చేశారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మురళి మోహన్ తన అభిప్రాయాన్ని తెలపగా.. ఆ స్థానాన్ని ఆయన కోడలు మాగంటి రూపకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు. స్థానిక నేతలు, మురళీ మోహన్‌తో సమావేశానంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే తిరుపతి ఎంపీ స్థానానికి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ఖరారు చేశారు. తన భర్త పనబాక కృష్ణయ్యతో కలిసి ఆమె త్వరలో టీడీపీలో చేరనుండగా.. ఆ లోపే పనబాక లక్ష్మికి బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు. మొదట ఆమెకు బాపట్ల స్థానాన్ని ఇవ్వాలనుకున్నప్పటికీ, చివరకు తిరుపతిని ఖరారు చేశారు. మరోవైపు సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయించాలంటూ పనబాక సుబ్బయ్య, చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది.