వైసీపీ తొలి జాబితా వాయిదా

హైదరాబాద్‌:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ, శాసనసభ స్థానాల అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడింది. ఇవాళ వెలువడాల్సిన జాబితా ప్రకటనను ఈ నెల 16కు వాయిదా వేశారు. ముహూర్తం దాటిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఇడుపులపాయలో 10 గంటల 26 నిమిషాలకు అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత జగన్‌ ప్రకటించనున్నారు. అదే రోజు జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దాదాపు 100 మందితో బుధవారం జాబితా […]

వైసీపీ తొలి జాబితా వాయిదా
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 13, 2019 | 1:43 PM

హైదరాబాద్‌:వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ, శాసనసభ స్థానాల అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడింది. ఇవాళ వెలువడాల్సిన జాబితా ప్రకటనను ఈ నెల 16కు వాయిదా వేశారు. ముహూర్తం దాటిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న ఇడుపులపాయలో 10 గంటల 26 నిమిషాలకు అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత జగన్‌ ప్రకటించనున్నారు. అదే రోజు జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. దాదాపు 100 మందితో బుధవారం జాబితా ప్రకటిస్తామని వైకాపా వర్గాలు తొలుత వెల్లడించిన సంగతి తెలిసిందే.