AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్‌పై కేంద్రం వినూత్న వ్యూహం..రేపే ముహూర్తం ?

ఆగస్టు 5వ తేదీన యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరుస్తూ అనూహ్య నిర్ణయంతో కాశ్మీర్ ఏనాటికైనా భారత్‌లో అంతర్బాగమని చాటిన ప్రధాని నరేంద్ర మోదీ.. తాజా మరో కీలక నిర్ణయంతో పాక్ నోరు మూయించేందుకు సిద్దమయ్యారు. గత 85 రోజులుగా కాశ్మీర్‌లోకి ఎవరినీ రానీయడం లేదని, అక్కడ పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని పాక్ ప్రచారం చేస్తున్న దరిమిలా ఏకంగా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులను కశ్మీర్‌లో పర్యటించాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. జమ్ముకశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి చూపించేందుకు […]

కశ్మీర్‌పై కేంద్రం వినూత్న వ్యూహం..రేపే ముహూర్తం ?
Rajesh Sharma
|

Updated on: Oct 28, 2019 | 8:48 PM

Share

ఆగస్టు 5వ తేదీన యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరుస్తూ అనూహ్య నిర్ణయంతో కాశ్మీర్ ఏనాటికైనా భారత్‌లో అంతర్బాగమని చాటిన ప్రధాని నరేంద్ర మోదీ.. తాజా మరో కీలక నిర్ణయంతో పాక్ నోరు మూయించేందుకు సిద్దమయ్యారు. గత 85 రోజులుగా కాశ్మీర్‌లోకి ఎవరినీ రానీయడం లేదని, అక్కడ పెద్ద ఎత్తున మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని పాక్ ప్రచారం చేస్తున్న దరిమిలా ఏకంగా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులను కశ్మీర్‌లో పర్యటించాల్సిందిగా మోదీ ఆహ్వానించారు.

జమ్ముకశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులు ప్రపంచానికి చూపించేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. మంగళవారం యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధి బృందం కశ్మీర్‌లో పర్యటించనుంది. ఆర్టికల్‌ 370 రద్దు తరువాత కశ్మీర్‌లో పర్యటిస్తున్న తొలి అంతర్జాతీయ బృందం ఇదే కావడం విశేషం.

ప్రధాని మోదీ పాకిస్తాన్‌పై దౌత్యపరంగా సర్జికల్‌ స్ట్రయిక్‌ చేశారు. యూరోపియన్‌ యూనియన్‌ బృందంతో కశ్మీర్‌పై కీలక చర్చలు జరిపారు మోదీ. శాంతి కోసం ఈయూ బృందం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. కశ్మీర్‌లో వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని వివరించారు. పాక్‌ ప్రచారాన్నినమ్మెద్దని, మీరు అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితులను చూడాలని యూరోపియన్‌ ఎంపీలను ప్రధాని కోరారు . ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు జరపాలని యూరోపియన్‌ నేతలకు మోదీ పిలుపునిచ్చారు.

జమ్ముకశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులపై ప్రపంచానికి పాకిస్తాన్‌ తప్పుడు సమాచారం ఇస్తోంది. పాక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈయూ బృందానికి అన్ని వివరాలు వెల్లడించబోతోంది భారత్‌. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో కూడా ఈయూ బృందం భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌లో వాస్తవ పరిస్థితిని ఈయూ బృందానికి వివరించారు జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌ దోవల్‌.

కశ్మీర్‌ నేతలు మాత్రం ఈయూ బృందం పర్యటనపై ఆచితూచి స్పందిస్తున్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో కాకుండా ఈయూ బృందం స్వేచ్చగా తిరిగేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే కశ్మీర్‌లో ఈయూ బృందం పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. ఈయూ బృందం పర్యటనకు ఎలా అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే కశ్మీర్‌లో ఈయూ బృందం పర్యటనను రద్దు చేయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్‌ చేశారు.

జమ్ముకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్తాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాని కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని ప్రపంచానికి ఈయూ బృందం పర్యటన తేటతెల్లం చేయబోతోంది. అంతర్జాతీయ మీడియాలో కూడా కశ్మీర్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్‌ పెట్టాలన్న ఆలోచనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.